బీసీ రిజర్వేషన్లు పెంచిన సి ఏం కు కృతజ్ఞతలు
గొల్లపల్లి / ఎండపల్లి మార్చి 23( ప్రజా మంటలు):
బీసీలకు 42% రిజర్వేషన్ పెంపు మరియు ఎస్సీ వర్గకరణను చట్ట సభల్లో ఆమోదించిన సంధర్బంగా ఎండపెల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలోని స్థానిక SR గార్డెన్స్లో రాష్ట్ర ముఖ్యమంత్రి, పీసీసీ నాయకులకు,రాష్ట్ర మంత్రులకు ఏర్పాటు చేసిన కృతజ్ఞతాభినందన సభలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మొదటగా ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు పత్తిపాక X రోడ్డు వద్ద విప్ లక్ష్మణ్ కుమార్ కు ఘనంగా స్వాగతం పలికారు,అనంతరం Xరోడ్ నుండి SR గార్డెన్స్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు
అనంతరం మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు 42% రిజర్వేషన్ పెంపు మరియు ఎస్సీ వర్గకరణను చట్ట సభల్లో ఆమోదించిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని,గత 30 సంవత్సరాలుగా ఎస్సి వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ ను ఏర్పాటు చేసి పోరాటం చేయడం అట్టి వర్గీకరణను సాధ్యం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్ట సభల్లో ప్రవేశపెట్టి ఆమోదించడం అదే విధంగా బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే విధంగా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగిందని,తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అని,150 కుటుంబాలకు ఒక్కో అధికారి చొప్పున కేటాయించి సిఎం రేవంత్ రెడ్డి పక్కగా సర్వే చేయించేయించడం జరిగిందని,30 సంవత్సరాల దళిత సోదరుల కల ఎస్సి వర్గీకరణను చేసి కాంగ్రెస్ ప్రభుత్వం దళిత సోదరులకు అండగా ఉంటుందని చెప్పడం జరిగిందని,తాను ఓడిన గెలిచిన ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉన్నానని,రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి భిక్ష కారణగానే ఎమ్మెల్యే ఐ,ప్రభుత్వ విప్ ఐ ఈ రోజు అసెంబ్లీలో మాట్లడగలుగుతున్న అని అసెంబ్లీలో చెప్పినప్పుడు సిఎం రేవంత్ రెడ్డినన్ను అభినందించడం దళితులు పడుతున్న కష్టాలు నాకు తెలుసు కాబట్టే మాదిగ ఉప కులాల వర్గీకరణపై అసెంబ్లీలో 30 నుండి 35 నిమిషాలు మాట్లాడగలిగానని,చేవెళ్లలో ఏర్పాటు చేసిన ఎస్సి,ఎస్టీ డిక్లరేషన్ లో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఎస్సి వర్గీకరణకు తమ పూర్తి మద్దతు ఉంటుందని అధికారంలోకి వచ్చిన వెంటనే సిఎం వర్డీకరణ అంశంపైన అందరి అభిప్రాయాలను తీసుకొని నిర్ణయానికి రావడం జరిగిందని,నేనే రాజు,నేనే మంత్రి,అన్ని మేమే అని 10 సంవత్సరాలు రాజ్యం ఏలిన గత బి.ఆర్.ఎస్ పాలకులు ఎందుకు ఎస్సి వర్గీకరణను చెయ్యలేదో సమాధానం చెప్పాలని,ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి నేను ఎల్లవేళలా కట్టుబడి ఉన్నానని,పలు గ్రాంట్లా ద్వారా గ్రామాల్లో రోడ్లు డ్రైనేజీలను ఏర్పాటు చేస్తున్నామని, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న చెగ్యం ముంపు బాధితులకు 18 కోట్ల రూపాయల పరిహారాన్ని అందించడం,తిరిగి పునఃప్రారంభం సాధ్యం కాదు అన్న ధర్మపురిలోని నైట్ కాలేజ్ ను తిరిగి పునఃప్రారంభం చేసుకోవడం,ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఏర్పాటు వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని,ఇంత పెద్ద ఎత్తున ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సంధర్బంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ లు వైస్ చైర్మన్ లు ధర్మపురి కాంసెన్సీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచులు నాయకులు యువకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో పంచాంగ శ్రవణం

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం

ప్రశాంతంగా రంజాన్ వేడుకలు * ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
