అత్యాచారానికి గురైన ఆశ వర్కర్ కు న్యాయం చేయాలని ఆశల ఆందోళన
జగిత్యాల మార్చి6(ప్రజా మంటలు)
జిల్లాలో అత్యాచారానికి గురైన ఆశా వర్కర్ కు న్యాయం చేయాలని కోరుతూ గురువారం సి ఐ టి యూ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఆందోళన చేపట్టారు.
జిల్లావ్యాప్తంగా ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికారులు స్పందించకపోవడంతో కలెక్టర్ ఆఫీసు నుండి ప్రజావాణి చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి మెయిన్ రోడ్డు పైన రాస్తరోకో నిర్వహించారు.రోడ్డు మొత్తం నాలుగు వైపుల దిబ్బందనం చేశారు. దీంతో అధికారులు దిగివచ్చారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ లత,డిఎస్పి రఘు, డీఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్ తదితర అధికారులు యూనియన్ నాయకులతో చర్చలు జరిపారు. నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు.
ఎఫ్ ఐ ఆర్ లో ఎస్సి ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని, నష్టపరిహారం కింద రూ/- 5 లక్షలు చెల్లిస్తామని, కలెక్టర్ నిధుల నుండి తక్షణ ఆర్థిక సహాయం కింద 50 వేలు ఇస్తామని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తామని, ఆశా వర్కర్లకు రక్షణ కల్పించడం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్య శాఖ జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ మెడికల్ డిపార్ట్మెంట్ నుండి కూడా కొంత ఆర్థిక సహాయం అందిస్తామని, ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలు పరిష్కరిస్తామని ధర్నా వద్దకు వచ్చి హామీ ఇచ్చారు.
దీనితో ఆశా యూనియన్ (సి ఐ టి యూ) రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి ఆందోళన కార్యక్రమాన్ని విరమింప చేశారు.
ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలు పి. జయలక్ష్మి, cpm రాష్ట్ర కమిటీ సభ్యులు లెల్లెల బాలకృష్ణ, జిల్లా ఆశా యూనియన్ గౌరవ అధ్యక్షురాలు ఇందూరి సులోచన కార్యదర్శి మమత జిల్లా నాయకులు దివ్య వనిత, జ్యోతి, గాయత్రి, ప్రేమలత సిపిఎం జిల్లా నాయకులు తిరుపతి నాయక్ మైపాల్ నాయక్ వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
