సైబర్ నేరాల, సైబర్ భద్రత పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి సైబర్ సెల్ డిఎస్పి రంగారెడ్డి
*
జగిత్యాల మార్చి 5(ప్రజా మంటలు)
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలమేరకు సైబర్ నేరాల, సైబర్ భద్రత పై అవగాహన గురించి ప్రతి నెల మొదటి బుధవారం రోజున సైబర్ జాగౄక్త దివాస్ అనే ప్రత్యేక కార్యక్రమం జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో వివిధ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు, యువతకు, ప్రజలకు సైబర్ భద్రత , సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
సైబర్ నేరాలపై అవగాహన కల్పించి , సైబర్ నేరాలను నివారించడమే జిల్లా పోలీసుల లక్ష్యం అని సైబర్ సెల్ డిఎస్పీ డి. వి రంగ రెడ్డి గ అన్నారు. అందులో బాగంగా ఈ రోజు నలంధ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు, సైబర్ క్రైం, షీ టీం పై అవగాహన కల్పించడంలో భాగంగా తెలంగాణ పోలీస్ ఆద్వర్యంలో సైబర్ జాగౄక్త దివస్ అనే కార్యక్రమం ద్వారా సైబర్ భద్రత తో పాటు సైబర్ నేరాలపై అవగాహన , నివారణకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతo ఫైల్‌ని ఉపయోగించి నకిలీ కస్టమర్ కేర్ మోసాలు, ఎక్కువగా జరుగుతున్నాయని వీటి పైన జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అదేవిధంగా వాట్స్అప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ను పిల్లలు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి వాటిని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లిదండ్రులు పిల్లలకు సూచించాలి. ఈ యెక్క కార్యక్రమ0 లో నేర్చుకున్న విషయాల్ని ప్రతి ఒక్కరు మిగతా వారికి అవగాహన కల్పించాల్సి ఉంటుందని అన్నారు. ఉపాధ్యాయులు సైతం సైబర్ నేరాల నియంత్రణలో తమవంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో అందరికీ అవగాహన తప్పనిసరి అన్నారు.అదే విదంగా మహిళలు హక్కులు , రక్షణకు షీ టీం ప్రత్యేకంగా పనిచేస్తుందన్నారు. విద్యార్థినులను వేధింపులకు గురిచేసిన, ర్యాగింగ్ చేసిన కఠిన చర్యలు ఉంటాయని స్కూల్లో, కళాశాలలో, బస్టాప్ ఇతర నిర్మాణ ప్రాంతాలు ఎవరైనా అమ్మాయిలను వేధిస్తే షీ టీం పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 8712670783 కు లేదా డయాల్ 100 కు కాల్ చేయాలన్నారు. అదే విధంగా షీ టీం పని విధానం, పొక్సో ఆక్ట్, ఈవిటిజింగ్, ర్యాగింగ్ పై అవగాహన కల్పించారు.
ఈ యొక్క అవగాహన కార్యక్రమం లో షి టీం ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ ఎస్.ఐ దినేష్ మరియ నలంధ డిగ్రీ కళాశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
