విద్యుత్ లైన్ మన్ ల సేవలు ప్రశంసనీయం ఎస్ఈ షాలియా నాయక్
మెట్పల్లి మార్చి 4(ప్రజా మంటలు)
ఘనంగా లైన్ మన్ దివస్ వేడుకలు
వినియోగదారుల సేవలో నాణ్యమైన, పారదర్శకమైన సేవలు అందించడంలో లైన్మెన్ ల పాత్ర ప్రశంసనీయమని జగిత్యాల ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శాలిని నాయక్ పేర్కొన్నారు.
లైన్ మన్ దివస్ సందర్భంగా మెట్టుపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, వ్యవసాయ పురోభివృద్ధికి నాణ్యమైన విద్యుత్ సరఫరా కొరకు క్షేత్రస్థాయిలో లైన్మెన్ లు అహోరాత్రులు శ్రమించి మంచి సేవలు అందిస్తున్నారని సిబ్బందిని కొనియాడారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ లైన్మెన్లు పనికి ఉపక్రమించేటప్పుడు ముందస్తు రక్షణ చర్యలు గైకొనాలని, ప్రమాదాల నివారణకు పూర్తిస్థాయిలో బాధ్యత తీసుకోవాలని సూచించారు. తద్వారా తనతోపాటు ఇతరులను కూడా ప్రమాదాల బారి నుండి రక్షించవచ్చని పేర్కొన్నారు.
డీఈ గంగారాం మాట్లాడుతూ ప్రస్తుత వేసవి కాలంలో ఇంటర్మీడియట్ పరీక్షలు, రంజాన్ తదితర ముఖ్యమైన సందర్భాల్లో అంతరయాలు లేని సరఫరా అందించుటకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగం, పరిశ్రమల కొరకు వేలాది కోట్ల విదేశీ పెట్టుబడులకు విద్యుత్ రంగంలో అద్భుతమైన మౌలిక వసతులు కారణమని అందుకు క్షేత్రస్థాయి సిబ్బంది అవిశ్రాంత కృషి కారణమని ఏడిఈ మనోహర్ తెలిపారు.
కార్యక్రమ ప్రారంభానికి ముందు గతంలో విధుల్లో ఉండి అశువులు బాసిన లైన్మెన్ లకు రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో సేవలో అత్యుత్తమ ప్రతిభ సిబ్బందికి ఎస్ఈ శాలియా నాయక్ మరియు డిఇ గంగారం లు ప్రశంసా పురస్కారాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఈ లు రవి, అజయ్, సబ్ ఇంజనీర్లు రమేష్, అభినయ్, స్రవంతి వివిధ మండలాల క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
