అన్ని వర్గాలకు సమాన హక్కులు, స్వేచ్ఛ, గౌరవం కల్పించిన మహోన్నత వ్యక్తి డా.బాబా సాహెబ్ అంబేద్కర్: జిల్లా ఎస్పి అశోక్ కుమార్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 14 (ప్రజా మంటలు)
సామాజిక వివక్షను జయించి, అత్యున్నత విద్యను సాధించిన గొప్ప మేధావిగా ,భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ఉండడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ అన్నారు.
భారతరత్న డా.బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం కల్పిస్తూ భారత దేశ అభివృద్ధికి, అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి గా అభివర్ణించారు. భారతీయ సమాజంలో కూడా దళితులు, పేదలు, మహిళల కు సమాజంలో సమాన గౌరవం కల్పించే దిశగా రాజ్యాంగ కల్పన చేసిన వ్యక్తి గా అభివర్ణించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే కాకుండా, సామాజిక సమానత్వం, స్వాతంత్య్రం, విద్య, శ్రామిక హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అని ఆయన భావాలు సమాజ అభివృద్ధికి దిక్సూచిగా నిలుస్తాయిని ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను అనుసరిస్తూ సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి కృషి చేయాలి అని పేర్కొన్నారు.
ఈ యొక్క కార్యక్రమమ లో అదనపు ఎస్పి బీమ్ రావు, డి సి ఆర్ బి డిఎస్పి సురేష్, ఎస్బి ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ వేణు, మరియు రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
