చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల విజయవంత నిర్వహణకు కృతజ్ఞతలుగా జిల్లా ఎస్పీకి సత్కారం
గొల్లపల్లి ఎప్రిల్ 14 (ప్రజా మంటలు):
కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా, శాంతియుతంగా నిర్వహించబడిన సందర్భంగా, ఈ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన భద్రతా ఏర్పాట్లను సమర్థవంతంగా చేపట్టిన జిల్లా పోలీస్ శాఖకు కృతజ్ఞతగా, ఆలయ ఈవో శ్రీకాంత్ రావు జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ను జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి, శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీకాంత్ రావు మాట్లాడుతూ, జయంతి ఉత్సవాల రోజులలో భక్తులు ఎటువంటిఇబ్బందులు లేకుండా, భద్రతతో కూడిన శాంతియుత వాతావరణంలో దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకున్న పోలీస్ శాఖకు మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీమాట్లాడుతూ.. జయంతి సందర్భంగా వేలాది మంది భక్తులు హాజరయ్యారు. ఈ ఉత్సవాలు ప్రశాంతంగా పూర్తయ్యేందుకు సహకరించిన హనుమాన్ మాల విరమణ భక్తులకు, ప్రజలకు, పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు. ఇతర జిల్లాల నుంచి సాయం చేసిన పోలీసు బృందాల సహకారం, క్షేత్రస్థాయిలో పనిచేసిన జగిత్యాల జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ ఉత్సవాలు విజయవంతంగా జరిగాయి అన్నారు. అదే విధంగా భవిష్యత్తులో నిర్వహించబోయే పండుగలు, కార్యక్రమాల సందర్భాలలో కూడా పోలీసు శాఖ తరపున పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లకు ఎల్లవేళలా ముందుంటామని తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
