న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేయాలి
న్యాయవాదులపై వరస దాడులపై నిరసన
*సికింద్రాబాద్ కోర్టు విధుల బహిష్కరించిన న్యాయవాదులు
సికింద్రాబాద్ ఎప్రిల్ 07 (ప్రజామంటలు) :
తెలంగాణ రాష్ర్టంలో న్యాయవాదులపై దాడులు వరసగా జరుగుతునే ఉన్నాయని, న్యాయవాదుల ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేయాలని సికింద్రాబాద్ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.రాజశేఖర్ రెడ్డి కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సీనియర్ న్యాయవాది మహ్మద్ ముస్తాఫా అలీ పై ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో కత్తులతో దాడి జరిగిందని, ఇటీవల కాలంలో న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన యక్తం చేశారు. న్యాయం కోసం కోర్టులో వాదనలు వినిపిస్తున్న తమకు రక్షణ లేదని, న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. న్యాయవాదిపై దాడి చేసిన వ్యక్తుల్ని కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాదిపై జరిగిన దాడికి నిరసనగా సోమవారం న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, ఉపాద్యక్షుడు మల్లికార్జున్, సంయుక్త కార్యదర్శి వినోద్ కుమార్, మహేశ్వరీ, సంతోష్ కుమార్, సమత, అనిత, సంజయ్, పానవి, మల్లేశ్, మురళిధర్, స్వామి పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర

కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

పోషణ పక్వాడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథి సిడిపిఓ వీరలక్ష్మి

ఎల్కతుర్తి సభకు గులాబీ సైనికులారా తరలిరండి - ఎమ్మెల్సీ కవిత గోడమీద రాతలు

ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో పోషణ జాతర

కాంగ్రెస్ వాళ్లకు బెదిరింపులు, మోసం చేయడం కొత్త కాదు - జగిత్యాల సభలో ఎమ్మెల్సీ కవిత

ట్రంప్ నిబంధనలను వ్యతిరేకించిన హార్వర్డ్ విశ్వవిద్యాలయ యాజమాన్యాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ప్రశంసించారు
.jpeg)
ఏసీబీకి చిక్కిన. చాంద్రాయణగుట్ట అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్
