అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో హరిహరాలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణ వేడుకలు
శ్రీధర గణపతి శర్మ
జగిత్యాల ఏప్రిల్ 6 (ప్రజా మంటలు)
జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. వైదిక క్రతువులు బుడి అరుణ్ శర్మ, సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ, అన్యారంభట్ల సాంబయ్య శర్మ తదితరులు నిర్వహించారు. మోతే మదన్ స్వరూప దంపతులు కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ నూతన కమిటీ అధ్యక్షులు చాకుంట వేణుమాధవ్ లక్ష్మీ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అదేవిధంగా నేరెళ్ల శ్రీనివాస్ చారి కుటుంబ సభ్యులు తలంబ్రాలు సమర్పించారు.
విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ, కళ్యాణ అక్షితలు అందజేశారు. భక్తులు అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఇదిలా ఉండగా లోకకళ్యాణార్థం రామకోటి పుస్తకాల ఆవిష్కరణ నిర్వహించారు .రామనామ స్మరణతో ఆలయమంతా మారుమోగింది. ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంటపంపై ఆసీనులు చేసి కళ్యాణాన్ని కొనసాగించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏఐసీసీ సమావేశాలకు వెళ్లిన కోట నీలిమ

ప్రియాంష్ ఆర్య 39 బంతుల్లో అద్భుతమైన సెంచరీతో చెన్నై బౌలింగ్ను చిత్తు చేశాడు

రాజయోగిని దాది రతన్ మోహినీ జీ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంతాపం

చలివేంద్రాన్ని ప్రారంభించిన డా.కోట నీలిమ

చోరికి వచ్చిన దొంగకు వింత అనుభవం..

ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు... ఏఐ అంటె అనుముల ఇంటెలిజెన్స్ - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

కోరుట్ల BSP నియోజకవర్గ ఇన్చార్జిగా రాంపల్లి బాలరాజు నేత, అధ్యక్షులుగా గుజ్జరీ ప్రకాష్

గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

ఇబ్రహీం పట్నంలో జిల్లా పశు వైద్యాధికారి ఆకస్మిక తనిఖీలు.

న్యాయవాది ముజాబ అలీ పై దాడికి నిరసనగా మెట్ పల్లి కోర్టులో న్యాయవాదులు విధుల బహిష్కరణ

గంగాపూర్ లో సన్న బియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వ విప్

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
