అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో హరిహరాలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణ వేడుకలు

శ్రీధర గణపతి శర్మ
జగిత్యాల ఏప్రిల్ 6 (ప్రజా మంటలు)
జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. వైదిక క్రతువులు బుడి అరుణ్ శర్మ, సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ, అన్యారంభట్ల సాంబయ్య శర్మ తదితరులు నిర్వహించారు. మోతే మదన్ స్వరూప దంపతులు కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ నూతన కమిటీ అధ్యక్షులు చాకుంట వేణుమాధవ్ లక్ష్మీ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అదేవిధంగా నేరెళ్ల శ్రీనివాస్ చారి కుటుంబ సభ్యులు తలంబ్రాలు సమర్పించారు.
విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ, కళ్యాణ అక్షితలు అందజేశారు. భక్తులు అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఇదిలా ఉండగా లోకకళ్యాణార్థం రామకోటి పుస్తకాల ఆవిష్కరణ నిర్వహించారు .రామనామ స్మరణతో ఆలయమంతా మారుమోగింది. ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంటపంపై ఆసీనులు చేసి కళ్యాణాన్ని కొనసాగించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురిలో వైభవంగా నరసింహుని జయంతి వేడుకలు

సహచర ఉద్యోగికి రూ,32,000 ఆర్థిక సహాయం

సీనియర్ సిటిజన్ల చట్టంపై అవగాహనకే పోస్టర్ల ప్రదర్శనలు

ఫుట్ పాత్ అనాధలను ఆదుకోండి.. మహాప్రభో ... స్కై ఫౌండేషన్ వేడుకోలు

బోలక్ పూర్ లో ఘనంగా మదర్స్ డే సెలబ్రేషన్స్

గాంధీ టెర్రస్ లపై రెడ్ క్రాస్ సింబల్ ల ఏర్పాటు..

అమరవీరుడు మురళి నాయక్ ఆత్మ శాంతి చేకూర్చాలని కొవ్వొత్తుల ర్యాలీ

రత్నాకర్ రావు సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం....ఎమ్మేల్యే డా.సంజయ్

ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా బి.ఆర్.ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

కరెంటు షాక్ తో మరణించిన కుటుంబానికి ప్రభుత్వం ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

భారత రక్షక దళాలకు మద్దతుగా పాత్రికేయుల సంఘీభావ ర్యాలీ

శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ వేడుకలు
