బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి
* పెండింగ్ లో ఉన్న ఫీ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
* ఖాళీగా ఉన్న బోధనా సిబ్బందినీ వెంటనే భర్తీ చేయాలి.
* విశ్వవిద్యాలయాల బడ్జెట్ మేరకు బ్లాక్ గ్రాంట్ కేటాయించాలి.
* మీడియా సమావేశంలో ఏబీవీపీ నాయకులు
సికింద్రాబాద్, మార్చి 12 ( ప్రజామంటలు):
వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టబోయే రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని ఏబీవీపీ సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ చెర్క. బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తామని,అధిక నిధులు కేటాయించి విద్యారంగ అభివృద్ధి కి కృషి చేస్తామని అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ విద్యారంగంపై సవితితల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. గత సంవత్సర బడ్జెట్ లో కేవలం 7శాతం నిధులే కేటాయించిందని వాటిని కూడా పూర్తిగా విడుదల చేయలేదన్నారు. చిన్న రాష్ట్రాలైన ఈశాన్య రాష్ట్రాల్లో సైతం వాటి బడ్జెట్లో 12-నుంచి13శాతం నిధులు కేటాయిస్తుంటే మన రాష్ట్రంలో అరకొర నిధులు కేటాయించడం సిగ్గుచేటన్నారు.వెంటనే ఈ బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించడంతో పాటుగా, వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీ రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్స్ ను విడుదల చేయాలని,విద్యారంగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, యూనివర్సిటీలకు బ్లాక్ గ్రాంట్ ను వాటి బడ్జెట్ మేరకు పెంచాలని డిమాండ్ చేశారు. లేకపోతే విద్యార్థి ,నిరుద్యోగ సమాజం ఈ ప్రభుత్వాన్ని ఉపేక్షించబోదని హెచ్చరించారు కార్యక్రమం లో ఏబీవీపీ సికింద్రాబాద్ పీజీ కాలేజీ ప్రెసిడెంట్ విజయ్,ఏబీవీపీ నాయకులు విగ్నేష్,తులసి పాల్గొన్నారు.
––––––––––
–ఫొటో:
More News...
<%- node_title %>
<%- node_title %>
అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి

బౌద్దనగర్ కార్పొరేటర్ కంది శైలజ పర్యటన

జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు జగిత్యాల జిల్లా అర్ టి ఏ మెంబర్.

జగిత్యాల పట్టణ ఆవోపా ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం

జగిత్యాల పట్టణ ఆవోపా ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం

భయం వీడితే...జయం మనదే..
.jpg)
మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు ..... కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)