ఈనెల 19 న BRS పార్టీ విస్తృత సమావేశం
పార్టీ రజతోత్సవ సన్నాహాలపై చర్చ
హైదరాబాద్ ఫిబ్రవరి 13:
అధినేత కేసీఆర్ అధ్యక్షతన, ఫిబ్రవరి 19 వ తేదీన బిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు.
ఈనెల 19 వ తేదీన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రకార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించి, ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కె.టి.రామారావును ఏర్పాట్లకు ఆదేశించారు.
ఈనెల 19 వ తేదీన మధ్యాహ్నం 1 గంటనుండి హైద్రాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో పార్టీ విస్త్రృత స్థాయి సమావేశం జరగనున్నది. కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్థుత మరియు మాజీ.ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పోరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు,డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలతో కూడిన విస్తృతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నామని పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తెలియజేశారు.
ఈ నెల 19 న నిర్వహించే ప్రత్యేక సమావేశంలో, బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు, పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృతస్థాయిలో చర్చించనున్నామని కెటిఆర్ తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలమీద ప్రధానంగా చర్చ జరగున్నది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అనుగుణంగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేపట్టవలసిన కార్యాచరణ పై సమగ్ర చర్చ జరగనున్నది.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించుకుంటూ, తమ హక్కులను తాము కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ నాయకత్వం కార్యకర్తలు శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలు విధానాల పై ఈ విస్తృతస్థాయి సమీక్షా సమావేశంలో చర్చించనున్నారని కేటిఆర్ తెలిపారు.
సమగ్ర చర్చ జరిపి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే కీలక సమావేశం కాబట్టి ఆహ్వానితులందరూ ఖశ్చితంగా హాజరుకావాలని కెటిఆర్ స్పష్టం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు
