కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ పలు విభాగాల్లో రోబో వైద్యసేవలు
- రోబోను ప్రారంభించిన డాక్టర్ గురవారెడ్డి
సికింద్రాబాద్ ఏప్రిల్ 07 (ప్రజామంటలు) :
రోబోటిక్ టెక్నాలజీ వల్ల రోగికి మెరుగైన, ఖచ్చితమైన, సేఫ్టీ తో కూడిన శస్త్ర చికిత్సలు నిర్వహించవచ్చని , కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో ఎక్కడ లేని విధంగా ఆరు రోబోలు అందుబాటులో ఉన్నాయని, నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చిన రోబోటిక్ డావిన్సి సాయంతో జనరల్ సర్జరీ, గైనకాలజీ, యూరాలజీలతో పాటు క్యాన్సర్ శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించవచ్చని కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ వి గురవారెడ్డి తెలిపారు. సోమవారం బేగంపేట కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో అత్యాధునిక శస్త్ర చికిత్స రోబోటిక్ డావిన్సి ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ కన్సల్టెంట్, హెడ్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, రోబోటిక్ సర్జన్ డాక్టర్ విమలాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ రోగికి మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ముందుకు సాగుతున్నామని, అందులో భాగంగానే డావిన్సి రోబోను అందుబాటులోకి తీసుకు వచ్చామని తెలిపారు. ఈ రోబో సాయంతో జిఐ, విపుల్, క్యాన్సర్, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్లు ప్యాంక్రియాటిక్ పైత్య గొట్టాలు, పెద్ద పేగు క్యాన్సర్ ఇలా కడుపు లోపలి భాగంలో ఎక్కడైనా శాస్త్ర చికిత్సలు నిర్వహించవచ్చని తెలిపారు. యూరాలజీ, సర్వైకల్, లాంగ్ అండ్ కార్డియాక్ చికిత్సలో కూడా ఈ రోబో ను ఉపయోగించి నిర్వహించవచ్చని సందర్భంగా డాక్టర్ విమలాకర్ రెడ్డి తెలిపారు. సర్జన్ ఆదేశాల మేరకు రోబో పనిచేస్తుందని తెలిపారు. రోబో సాయంతో నిర్వహించిన ఎర్నియా శాస్త్ర చికిత్స వీడియోను డాక్టర్ విమలాకర్ రెడ్డి ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మీడియా సమావేశంలో కార్డియో థోరాసిక్ సర్జన్ డాక్టర్ పి ఎన్ రావు, యూరాలజిస్ట్ డాక్టర్ నందకుమార్, డాక్టర్ శ్రీహర్ష, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పృథ్వీరాజ్, గైనకాలజిస్ట్ డాక్టర్ హవ్య లతో పాటు కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్స్ సి ఓ ఓ సుధాకర్ జాదవ్ తో పాటు హాస్పిటల్ లోని వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పాల్గొన్నారు.
–ఫొటో
More News...
<%- node_title %>
<%- node_title %>
కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర

కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

పోషణ పక్వాడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథి సిడిపిఓ వీరలక్ష్మి

ఎల్కతుర్తి సభకు గులాబీ సైనికులారా తరలిరండి - ఎమ్మెల్సీ కవిత గోడమీద రాతలు

ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో పోషణ జాతర

కాంగ్రెస్ వాళ్లకు బెదిరింపులు, మోసం చేయడం కొత్త కాదు - జగిత్యాల సభలో ఎమ్మెల్సీ కవిత

ట్రంప్ నిబంధనలను వ్యతిరేకించిన హార్వర్డ్ విశ్వవిద్యాలయ యాజమాన్యాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ప్రశంసించారు
.jpeg)
ఏసీబీకి చిక్కిన. చాంద్రాయణగుట్ట అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్
