కృత, త్రేతాయుగ దైవాలకు కల్యాణ ఏర్పాట్లు
సీతారామ కల్యాణానికి సర్వం సిద్ధం
నేడు సాయి జన్మదిన వేడుకలు
(రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494)
ధర్మపురి ఎప్రిల్ 05:
క్షేత్రస్థ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో చైత్ర మాస వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈనెల 6న ఆది వారం శ్రీసీతారామ కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. ధర్మపురి దేవస్థానంలో నిర్వహించే సీతారామ కళ్యాణానికి ఒక ప్రత్యేకత ఉంది. శ్రీరాముడు త్రేతాయుగానికి చెందిన వారు. నరసింహుడు కృత యుగానికి చెందిన వారు. కృత యుగ దైవానికీ, త్రేతాయుగ దైవానికీ అనగా నరసింహునికి, శ్రీరామ చంద్రునికి కలిపి ఒకే సమయాన ఒకే వేదికపై కళ్యాణాలు జరిపించడం ధర్మపురికి మాత్రమే ప్రత్యేకం. దుష్ట సంహారుడైన నరసింహుడు, ధర్మ స్వరూపుడైన రామచంద్రుడు ఇరువురి కళ్యాణాలు కమనీయంగా, రమణీయంగా నిర్వహించేందుకు దేవస్థానం విస్తృత ఏర్పాట్లలో తల మునకలై ఉంది.
6న ఆది వారం అభిజిత్ లగ్న మధ్యాహ్నం 12 గంటలు శుభ ముహూర్తాన దేవస్థానంలోని శేషప్ప కళావేదికపై వైష్ణవ సంప్రదాయ రీతిలో కన్నుల పండువగా నిర్వహించనున్న ఇరువురు అవతార మూర్తుల ఏకకాల కల్యాణాల కోసం దేవస్థానం జక్కు రవీందర్ నేతృత్వం లోని ధర్మ కర్తల మండలి, ఈఓ శ్రీనివాస్, ఉప ప్రధానార్చకులు నేరెళ్ళ శ్రీనివాసాచార్యులు, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసా చార్య, ఆస్థాన వేద పండితులు రమేశ్ శర్మ, యాజ్ఞికులు అర్చకులు, సిబ్బంది, ప్రత్యేక ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు.
సీతారామ కల్యాణానికి సర్వం సిద్ధం
దక్షిణ కాశిగా, హరిహర క్షేత్రంగా, నవనారసింహ క్షేత్రాలలో నొటిగా, పవిత్ర గోదావరీ నదీ తీరాన వెలసి, పలు దేవాలయాల సముదా యంతో అపర వికుంఠ పురియై అలరారుతున్న, సనాతన సాంప్ర దాయాల సిరియైన గోదావరీ తీరస్థ ధర్మపురి క్షేత్రంలో స్మార్త సాంప్రదాయ రీతిలో శ్రీరామనవమి సహిత కళ్యాణోత్సవ వేడుకలు వైభవోపేతంగా జరుగ డానికి సర్వం సిద్ధమైంది. ప్రధానంగా దక్షిణాభి ముఖియై విశేష ప్రాధాన్యను సంతరించుకున్న పరమ పావనియైన గోదావరినదీ తీరాన వెలసిన క్షేత్రంలోని అతి ప్రాచీన రామాలయంలో శ్రీరామనవమి వేడుకలను ఏటా ఘనంగా క్రమంలో ఆలయ నిర్వహణ కమిటి ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లను గావించారు. శ్రీరామనవమి పవిత్ర దిన సందర్భంగా, ఉదయాత్పూర్వం నుండే అభిషేక, నిత్యపూజ, రామజన్మోత్సవ ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం మద్యాహ్నం కర్కాటక లగ్న సముహూర్తంలో వేదవిదులైన పండితోత్తములచే సీతారాముల కళ్యాణాన్ని వేదోక్త సాంప్రదా యరీతిలో నిర్వహించేందుకు ఆలయ వంశపారంపర్య అర్చకులు తాడూరి బాలకృష్ణయ్య, బల రామశర్మ, బాల చంద్రశర్మ, మోహన్ శర్మ, వామన శర్మ, ప్రభుత్వ ధూప దీప నైవేద్య పథక అర్చకులు తాడూరి రఘునాథ శర్మలు సకల ఏర్పాట్లు గావించారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, త్రాగునీటి సౌకర్యాలు కల్పించే ఏర్పాట్లు చేశారు.
శ్రీరామనవమి ఏర్పాట్లు
సనాతన సాంప్రదాయాల సిరియైన గోదావరీ తీరస్థ ధర్మపురి క్షేత్రంలోని శ్రీలక్ష్మీ నరసింహ కాలనీలో నూతన నిర్మిత శ్రీరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవ వేడుకలు వైభవోపేతంగా జరుగనున్నాయి. శ్రీరామనవమి పవిత్ర దిన సందర్భంగా, ఉదయా త్పూర్వం నుండే అభిషేక, నిత్య పూజ, రామజన్మోత్సవ ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం మద్యాహ్నం కర్కాటక లగ్న సముహూర్తంలో వేదవిదులైన పండి తోత్తములచే సీతారాముల కళ్యాణాన్ని వేదోక్త సాంప్రదా యరీతిలో నిర్వహించేందుకు కమిటీ పర్యవేక్షణలో ఏర్పాట్లలో తల మునకలై ఉన్నారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్ళు, త్రాగునీటి సౌకర్యాలు, కల్పించే దిశగా చర్యలు చేపట్టారు. మండలంలోని దొంతాపూర్ గ్రామంలోని శ్రీ కోదండ రామాలయంలో రామ నవమి ఉత్సవ సందర్భంగా విశేష ఏర్పాట్లను కమిటి సభ్యులు తదితరులు ఆలయ అర్చకులు దేవళ్ళ వంశజుల పర్యవేక్షణలో గావిస్తున్నారు. తిమ్మాపూర్ శ్రీసీతారామాంజనేయ స్వామి ఆలయంలో ధర్మపురి దేవస్థానం పక్షాన, సమీపస్థ గండి హన్మాండ్లు ఆలయంలో, శాలపల్లి శ్రీసీతా రామస్వామి ఆలయంలో, జైనా, దోనూరు, వెల్గొండ తదితర గ్రామా లలో గల రామాలయాల లోనూ రామ జన్మ, కళ్యాణోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
నేడు సాయి జన్మదిన వేడుకలు
ధర్మపురి క్షేత్రంలో పవిత్ర గోదావరీ నదీ తీరాన వెలసిన శ్రీసాయి శివ బాలాజీ మందిరంలో ఆది వారం సాయిబాబా జన్మ దిన వేడుకలు వైభవంగా జరుగనున్నాయి. ఆలయ వ్యవస్థాపక నిర్మాత, చైర్మన్ ఒజ్జల ప్రవీణ్ కుమార్ శర్మ, ట్రస్టు అధ్యక్షులు గోలి రాంప్రసాద్ మార్గ దర్శకత్వంలో, అర్చకుల పర్య వేక్షణలో, స్థానిక వేద పండితుల ఆధ్వ ర్యంలో ఉదయాతూర్వం నుండి విధివిధాన సాంప్రదాయ రీతిలో పంచోపనిషత్ పురుషసూక్త యుక్త ప్రత్యేక పూజలు, జన్మదిన అర్చనలు, ప్రత్యేకించి కుల మత, వర్ణాలకు అతీతంగా దేవస్థానం పక్షాన మహా క్షీరాభిషేక కార్యక్రమా లను నిర్వహించ నున్నారు. ముఖ్యంగా 111 కలశాలతో పూర్ణా భిషేకం, 111 రకాల భక్ష్య, భోజ్యములతో నివేదనాలు నిర్వహించడం జరు గుతుందని, భక్తజనులు స్వహస్తాలతో, సాయినాథున్ని క్షీరాభిషిక్తుడిని ఉదయం 6 నుండి 8గంటల వరకు చేసే మహదవకాశాన్ని వినియోగించుకుని, సాయి కృపకు పాతృలు కావాలని నిర్వాహకులు కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గొల్లపల్లి మండలం భీమ్రాజు పల్లి లో సీతారాముల కళ్యాణం

ప్రారంభమైన రాములోరి శోభాయాత్ర

ధర్మపురిలో నయనానందకరం సీతారామ కల్యాణం

శ్రీకళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో కన్నుల పండుగగా సీతారాముల కల్యాణం

వృద్ధుల సంరక్షణ,మహిళా చట్టాలపై అవగాహన సదస్సు.

మలయాళ చిత్ర పరిశ్రమ కొత్త బెంచ్ మార్క్ .L 2 - ఎంపురాన్

కమనియం రమనియం శ్రీ సీతరాముల కళ్యాణం.

సికింద్రాబాద్ లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం

గాంధీలో కాలోజీ వర్సిటీ వీసీకి ఘన సన్మానం

సభ సక్సెస్ అయ్యేనా ??

కళ్యాణం కమనీయం... కళ్యాణి క్షేత్ర శ్రీ సీతారాముల కల్యాణం

లోక కళ్యాణార్థం హరిహరాలయంలో రామకోటి పుస్తక ఆవిష్కరణ
.jpg)