కృత, త్రేతాయుగ దైవాలకు కల్యాణ ఏర్పాట్లు

సీతారామ కల్యాణానికి సర్వం సిద్ధం

On
కృత, త్రేతాయుగ దైవాలకు కల్యాణ ఏర్పాట్లు

నేడు సాయి జన్మదిన వేడుకలు

(రామ కిష్టయ్య సంగన భట్ల  9440595494)

 ధర్మపురి ఎప్రిల్ 05:

క్షేత్రస్థ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో చైత్ర మాస వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈనెల 6న ఆది వారం శ్రీసీతారామ కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. ధర్మపురి దేవస్థానంలో నిర్వహించే సీతారామ కళ్యాణానికి ఒక ప్రత్యేకత ఉంది. శ్రీరాముడు త్రేతాయుగానికి చెందిన వారు. నరసింహుడు కృత యుగానికి చెందిన వారు. కృత యుగ దైవానికీ, త్రేతాయుగ దైవానికీ అనగా నరసింహునికి, శ్రీరామ చంద్రునికి కలిపి ఒకే సమయాన ఒకే వేదికపై కళ్యాణాలు జరిపించడం ధర్మపురికి మాత్రమే ప్రత్యేకం. దుష్ట సంహారుడైన నరసింహుడు, ధర్మ స్వరూపుడైన రామచంద్రుడు ఇరువురి కళ్యాణాలు కమనీయంగా, రమణీయంగా నిర్వహించేందుకు దేవస్థానం విస్తృత ఏర్పాట్లలో తల మునకలై ఉంది.

6న ఆది వారం అభిజిత్ లగ్న మధ్యాహ్నం 12 గంటలు శుభ ముహూర్తాన దేవస్థానంలోని శేషప్ప కళావేదికపై వైష్ణవ సంప్రదాయ రీతిలో కన్నుల పండువగా నిర్వహించనున్న ఇరువురు అవతార మూర్తుల ఏకకాల కల్యాణాల కోసం దేవస్థానం జక్కు రవీందర్ నేతృత్వం లోని ధర్మ కర్తల మండలి, ఈఓ శ్రీనివాస్,  ఉప ప్రధానార్చకులు నేరెళ్ళ శ్రీనివాసాచార్యులు, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసా చార్య,  ఆస్థాన వేద పండితులు రమేశ్ శర్మ, యాజ్ఞికులు అర్చకులు, సిబ్బంది, ప్రత్యేక ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. 

సీతారామ కల్యాణానికి సర్వం సిద్ధం

 దక్షిణ కాశిగా, హరిహర క్షేత్రంగా, నవనారసింహ క్షేత్రాలలో నొటిగా, పవిత్ర గోదావరీ నదీ తీరాన వెలసి, పలు దేవాలయాల సముదా యంతో అపర వికుంఠ పురియై అలరారుతున్న, సనాతన సాంప్ర దాయాల సిరియైన గోదావరీ తీరస్థ ధర్మపురి క్షేత్రంలో  స్మార్త సాంప్రదాయ రీతిలో శ్రీరామనవమి సహిత కళ్యాణోత్సవ వేడుకలు వైభవోపేతంగా జరుగ డానికి సర్వం సిద్ధమైంది. ప్రధానంగా దక్షిణాభి ముఖియై విశేష ప్రాధాన్యను సంతరించుకున్న పరమ పావనియైన గోదావరినదీ తీరాన వెలసిన క్షేత్రంలోని అతి ప్రాచీన రామాలయంలో శ్రీరామనవమి వేడుకలను ఏటా ఘనంగా క్రమంలో ఆలయ నిర్వహణ కమిటి ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లను గావించారు. శ్రీరామనవమి పవిత్ర దిన సందర్భంగా,  ఉదయాత్పూర్వం నుండే అభిషేక, నిత్యపూజ, రామజన్మోత్సవ ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం మద్యాహ్నం కర్కాటక లగ్న సముహూర్తంలో వేదవిదులైన పండితోత్తములచే సీతారాముల కళ్యాణాన్ని వేదోక్త సాంప్రదా యరీతిలో నిర్వహించేందుకు ఆలయ వంశపారంపర్య అర్చకులు తాడూరి బాలకృష్ణయ్య, బల రామశర్మ, బాల చంద్రశర్మ, మోహన్ శర్మ, వామన శర్మ, ప్రభుత్వ ధూప దీప నైవేద్య పథక అర్చకులు తాడూరి రఘునాథ శర్మలు సకల ఏర్పాట్లు గావించారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, త్రాగునీటి సౌకర్యాలు కల్పించే ఏర్పాట్లు చేశారు.

శ్రీరామనవమి ఏర్పాట్లు

సనాతన సాంప్రదాయాల సిరియైన గోదావరీ తీరస్థ ధర్మపురి క్షేత్రంలోని శ్రీలక్ష్మీ నరసింహ కాలనీలో నూతన నిర్మిత శ్రీరామాలయంలో  శ్రీరామనవమి ఉత్సవ వేడుకలు వైభవోపేతంగా జరుగనున్నాయి. శ్రీరామనవమి పవిత్ర దిన సందర్భంగా,  ఉదయా త్పూర్వం నుండే అభిషేక, నిత్య పూజ, రామజన్మోత్సవ ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం మద్యాహ్నం కర్కాటక లగ్న సముహూర్తంలో వేదవిదులైన పండి తోత్తములచే సీతారాముల కళ్యాణాన్ని వేదోక్త సాంప్రదా యరీతిలో నిర్వహించేందుకు కమిటీ పర్యవేక్షణలో ఏర్పాట్లలో తల మునకలై ఉన్నారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్ళు, త్రాగునీటి సౌకర్యాలు, కల్పించే దిశగా చర్యలు చేపట్టారు. మండలంలోని దొంతాపూర్ గ్రామంలోని శ్రీ కోదండ రామాలయంలో రామ నవమి ఉత్సవ సందర్భంగా విశేష ఏర్పాట్లను  కమిటి సభ్యులు తదితరులు ఆలయ అర్చకులు దేవళ్ళ వంశజుల పర్యవేక్షణలో గావిస్తున్నారు. తిమ్మాపూర్ శ్రీసీతారామాంజనేయ స్వామి ఆలయంలో ధర్మపురి దేవస్థానం పక్షాన, సమీపస్థ గండి హన్మాండ్లు ఆలయంలో, శాలపల్లి శ్రీసీతా రామస్వామి ఆలయంలో, జైనా, దోనూరు, వెల్గొండ తదితర గ్రామా లలో గల రామాలయాల లోనూ రామ జన్మ, కళ్యాణోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

నేడు సాయి జన్మదిన వేడుకలు

 ధర్మపురి క్షేత్రంలో పవిత్ర గోదావరీ నదీ తీరాన వెలసిన శ్రీసాయి శివ బాలాజీ మందిరంలో ఆది వారం సాయిబాబా జన్మ దిన వేడుకలు వైభవంగా జరుగనున్నాయి. ఆలయ వ్యవస్థాపక నిర్మాత, చైర్మన్ ఒజ్జల ప్రవీణ్ కుమార్ శర్మ, ట్రస్టు అధ్యక్షులు గోలి రాంప్రసాద్ మార్గ దర్శకత్వంలో, అర్చకుల పర్య వేక్షణలో, స్థానిక వేద పండితుల ఆధ్వ ర్యంలో ఉదయాతూర్వం నుండి విధివిధాన సాంప్రదాయ రీతిలో పంచోపనిషత్ పురుషసూక్త యుక్త ప్రత్యేక పూజలు, జన్మదిన అర్చనలు, ప్రత్యేకించి కుల మత, వర్ణాలకు అతీతంగా దేవస్థానం పక్షాన మహా క్షీరాభిషేక కార్యక్రమా లను నిర్వహించ నున్నారు. ముఖ్యంగా 111 కలశాలతో పూర్ణా భిషేకం, 111 రకాల భక్ష్య, భోజ్యములతో నివేదనాలు నిర్వహించడం జరు గుతుందని, భక్తజనులు స్వహస్తాలతో, సాయినాథున్ని క్షీరాభిషిక్తుడిని ఉదయం 6 నుండి 8గంటల వరకు చేసే మహదవకాశాన్ని వినియోగించుకుని, సాయి కృపకు పాతృలు కావాలని నిర్వాహకులు కోరారు.

Tags

More News...

National  Sports  State News 

ప్రియాంష్ ఆర్య 39 బంతుల్లో అద్భుతమైన సెంచరీతో చెన్నై బౌలింగ్ను చిత్తు చేశాడు

ప్రియాంష్ ఆర్య 39 బంతుల్లో అద్భుతమైన సెంచరీతో చెన్నై బౌలింగ్ను చిత్తు చేశాడు ఐపీఎల్ చెన్నై జట్టుకు 220 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చండీగఢ్ ఎప్రిల్ 08: చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టు పరుగులు సాధించింది. దీంతో చెన్నై ముందు 220 పరుగుల లక్ష్యం ఉంది. చండీగఢ్ చెన్నై, పంజాబ్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 22వ మ్యాచ్లో పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్...
Read More...
National  State News 

రాజయోగిని దాది రతన్ మోహినీ జీ  మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంతాపం

 రాజయోగిని దాది రతన్ మోహినీ జీ  మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంతాపం హైదరాబాద్ ఏప్రిల్ 08: బ్రహ్మకుమారీస్ గ్లోబల్ సెంటర్ల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్‌గా విశిష్ట సేవలందించిన రాజయోగిని దాది రతన్ మోహినీ జీ  మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదర్శవంతమైన దాది జీ జీవితం ఆధ్యాత్మిక బలానికి, నిర్మలత్వానికి, విశ్వ సోదరభావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని కొనియాడారు. వారి జీవితం...
Read More...
Local News 

చలివేంద్రాన్ని ప్రారంభించిన డా.కోట నీలిమ

చలివేంద్రాన్ని ప్రారంభించిన డా.కోట నీలిమ సికింద్రాబాద్ ఏప్రిల్ 08 (ప్రజామంటలు) సనతనగర్ నియోజకవర్గం లోని, బన్సీలాల్ పేట్ డివిజన్, కట్టెలమండిలో సౌరవ్, అన్షు జైస్వాల్, తండ్రిగారైన దివంగత రాధేశ్యామ్ జైస్వాల్  స్మృత్యార్థం చలివేంద్ర కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సనతనగర్ కాంగ్రెస్ ఇంచార్జ్ డా. కోటా నీలిమ  ముఖ్య అతిధిగా హాజరై, ప్రారంభించారు.  ఈ చలివేంద్ర కేంద్రం ముఖ్య...
Read More...
Local News 

చోరికి వచ్చిన  దొంగకు వింత అనుభవం..

చోరికి వచ్చిన  దొంగకు వింత అనుభవం.. చోరీ చేసి పారిపోతుండగా కిందపడి తలకు గాయాలు...ఆసుపత్రిలో చేర్పించి తమ ఉదారతను చాటుకున్న కాలనీ వాసులు.. సికింద్రాబాద్ ఏప్రిల్ 07 (ప్రజామంటలు):   ఓ దొంగ(35) మద్యం తాగి సెల్ ఫోన్ దొంగతనానికి వచ్చి ఇంట్లో వాళ్లు నిద్రలేవడంతో పట్టుకుంటారేమోనని  భయంతో పారిపోతూ మెట్లపై నుంచి జారి పడి తీవ్ర గాయాలపాలై స్పృహత ప్పి పడిపోయాడు.గోపాలపురం...
Read More...
Local News  State News 

ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు... ఏఐ అంటె అనుముల ఇంటెలిజెన్స్ - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు... ఏఐ అంటె అనుముల ఇంటెలిజెన్స్ - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత   అనుముల ఇంటెలిజెన్స్ తో రాష్ట్రానికి చాలా ప్రమాదం. అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోంది. ప్రజలను మోసం చేయడమే అనుముల ఇంటెలిజెన్స్. బీసీ బిల్లుల ఆమోదానికి కేంద్రంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. బీజేపీ డీఎన్ఏలోనే బీసీ, దళిత వ్యతిరేకత బీజేపీ ప్రభుత్వం గిరిజన మహిళ అయిన రాష్ట్రపతిని ఆహ్వానించలేదని, గిరిజన బిడ్డ రాష్ట్రపతి అయినా...
Read More...
Local News 

కోరుట్ల BSP నియోజకవర్గ ఇన్చార్జిగా రాంపల్లి బాలరాజు నేత, అధ్యక్షులుగా గుజ్జరీ ప్రకాష్

   కోరుట్ల BSP నియోజకవర్గ ఇన్చార్జిగా రాంపల్లి బాలరాజు నేత, అధ్యక్షులుగా గుజ్జరీ ప్రకాష్   మెట్టుపల్లి ఏప్రిల్ 8 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   బహుజన సమాజ్ పార్టీ  కోరుట్ల నియోజకవర్గం ఇన్చార్జిగా రాంపల్లి బాలరాజ్ నేత ను, కోరుట్ల నియోజకవర్గం అధ్యక్షులు గుజ్జరీ ప్రకాష్ ను  నియమిస్తున్నట్లు జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లంపల్లి  సంపత్ కుమార్ తెలియజేశారు,  కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ జోన్ కోఆర్డినేటర్ కల్లేపల్లి రాజేందర్, జగిత్యాల...
Read More...
Local News 

గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 8 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ) ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తిని మెట్పల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మరణించినాడు, ఇబ్రహీంపట్నం మండలంలోని హనుమాన్ టెంపుల్ వద్ద ఒక గుర్తుతెలియని మగ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా అది చూసినవారు 108...
Read More...
Local News 

ఇబ్రహీం పట్నంలో జిల్లా పశు వైద్యాధికారి ఆకస్మిక తనిఖీలు.

ఇబ్రహీం పట్నంలో  జిల్లా పశు వైద్యాధికారి ఆకస్మిక తనిఖీలు. ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 8 (ప్రజా మంటలు - దగ్గుల అశోక్ ): ఇబ్రహీంపట్నం మండలం గోధుర్ మరియు ఇబ్రహీంపట్నం పశు వైద్యాశాలలను జిల్లా పశువైద్యాధికారి డా, వేణుగోపాల్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా భారత పశు గాణన  గురించి పశువైద్య సిబ్బంది కి తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమం లో మండల...
Read More...
Local News 

న్యాయవాది ముజాబ అలీ పై దాడికి నిరసనగా మెట్ పల్లి కోర్టులో న్యాయవాదులు విధుల బహిష్కరణ

న్యాయవాది ముజాబ అలీ పై దాడికి నిరసనగా మెట్ పల్లి కోర్టులో న్యాయవాదులు విధుల బహిష్కరణ మెట్టుపల్లి ఏప్రిల్ 8 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): హైదరాబాద్ లోని నాంపల్లి క్రిమినల్ కోర్టుకి చెందిన న్యాయవాది ముజాబ అలీ పై దాడికి నిరసనగా మెట్ పల్లి కోర్టులో న్యాయవాదులు మంగళవారం విధుల్ని బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, వృత్తి రీత్య తమ పని తాము...
Read More...
Local News 

గంగాపూర్ లో సన్న బియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వ విప్

గంగాపూర్ లో సన్న బియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వ విప్    బగ్గారం ఏప్రిల్ 08 (ప్రజా మంటలు): బుగ్గారం మండలం గంగాపూర్ లో మంగళవారం సన్న బియ్యం పథకాన్ని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల్ని ఆడుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేసి తీరుతామని ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు. తహసీల్దార్...
Read More...
Local News 

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కాంగ్రెస్ నాయకులు జువ్వాడి నర్సింగరావు   ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 8 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   జగిత్యాల జిల్లా  ఇబ్రహీంపట్నం మండలం అమ్మకాపేట గ్రామo లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాబు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర అమ్మకాపేట గ్రామ శాఖ ఈ...
Read More...
Local News 

శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు గొల్లపల్లి  ఎప్రిల్ 08 (ప్రజామంటలు): గొల్లపెల్లి మండలం  కేంద్రంలో శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం  కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్లబండ్ల పోటీలు హోరాహోరీగా సాగాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన 23ఎడ్ల బండ్లు పోటీల్లో పాల్గొనగా ఆధ్యంతం తీవ్ర ఉత్కంఠభరితంగా సాగిన ఎడ్లబండ పోటీలను తిలకించేందుకు మండలం నలుమూలల నుంచే కాక చుట్టుపక్కల మండలాల...
Read More...