ధర్మపురిలో నయనానందకరం సీతారామ కల్యాణం

On
ధర్మపురిలో నయనానందకరం సీతారామ కల్యాణం

( రామ కిష్టయ్య సంగన భట్లIMG-20250406-WA0017
 9440595494)

రామ కల్యాణోత్సవ వేడుకలు వైభవో పేతంగా, కన్నుల పండువగా జరిగాయి. ధర్మపురి క్షేత్రంలో గోదావరి తీరాన వెలసిన శ్రీరామాలయంలో ఉదయం శ్రీరామ జన్మో త్సవ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన వంశపారంపర్య అర్చకులు తాడూరి బాలకిష్టయ్య శర్మ, బలరామ శర్మ, బాలచంద్రశర్మ, రఘునాథ శర్మ, మోహన్ శర్మ, 

 వామనశర్మ, రామశర్మ, శరచ్చంద్ర శర్మ, ఆశ్రిత్ శర్మ, విలోక్ శర్మ, భరత్ శర్మల ఆధ్వర్యంలో విధివిధాన వేదోక్త సంప్ర దాయ పూజలొనరించారు. కల్యాణోత్సవం సందర్భంగా స్వస్తి పుణ్యాహ వాచనం, వామదేవ శతానంద రుత్విగ్వరణం, కళ్యాణార్థం వివాహ వేదిక ప్రవేశం, శ్రీరామచంద్ర వరునికై కన్యా న్వేషణ, సీతారామ వంశావళి ప్రవరలు, మధుపర్క ప్రాశనం, సముహూర్త, మంగళ సూత్ర ధారణం, అక్ష తారోపణం, వివాహానంతర లఘు పూజ, నైవేద్యం, మహామంత్ర పుష్పం, దేవతాశీర్వచనం తదితర ప్రత్యేక కార్య క్రమాలను నిర్వహించారు. సర్వాలంకార శోభితులై, పుష్ప మాలాలంకృతు లైన శ్రీరామచంద్రునికి, పరమపావని యైన లోకమాత సీతాదేవికి లోకకల్యా కల్యాణార్ధం అభిజిత్ లగ్న శుభ ముహూ ర్తంలో మధ్యాహ్నం మూల విరాట్టులకు జరిపించిన కల్యాణ మహోత్సవానికి వేలాదిమంది భక్తులు హాజరై కన్నులారా గాంచి తరించారు. రామాలయంలో వేదవిదులు మధు శంకర శర్మ, బల్యపెల్లి ప్రసాద్ శర్మ, సంగన భట్ల నర్సయ్య శర్మ, 
పనతుల వెంకట రమణ శర్మ, మధు మహాదేవ్ శర్మ, ఒజ్జల వేంకట రమణ శర్మ, కషోజ్జల రాజేష్ శర్మ, ఇందారపు లక్ష్మీ కాంత్ శర్మ, రాంకిషన్ శర్మ, పెండ్యాల బాలకృష్ణ శర్మ, బొజ్జా ఉమాకాంత్, కొరిడే శంకర్, కాకేరి గోపాల్, 
కాసర్ల వేంకట రమణ శర్మ,  భరత్ శర్మ, ప్రసాద్ శర్మ, పాలేపు దత్తాత్రి, సంగన భట్ల నర్సయ్య, సురేందర్, గొల్లపెల్లి గుండయ్య 
తదితరులు కల్యాణోత్సవాన్ని జరిపించారు.

పట్టు వస్త్రాల సమర్పణ

ధర్మపురి దేవస్థానం పక్షాన ముత్యాల తలంబ్రాలు పట్టువస్త్రాలు ప్రతి సంవత్సరము వలె ఈ సంవత్సరముకూడ అందజేయటం జరిగింది. దేవస్థానం ధర్మకర్తల మండలి అద్యక్షులు జక్కు రవీందర్, ధర్మకర్తలు బాదినేని వెంకటేష్,  బొల్లారం పోచయ్య, గుడ్ల రవీందర్,  కొమురెల్లి పవన్ కుమార్,  మందుల మల్లేష్, నేదునూరి శ్రీధర్, రాపర్తి సాయికిరణ్, స్తంభంకాడి గణేష్, సంబెట తిరుపతి, ఒజ్జల సౌజన్య నరేందర్, ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు ,   సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ 
 పాల్గొన్నారు.   

లక్ష్మీ నరసింహ కాలనీలో

ధర్మపురి పట్ట ణంలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి కాల నీలో నిర్మితమైన శ్రీరామాలయంలో  వేద పండితులు కాసర్ల వంశీ కృష్ణ, కషోజ్జల బాలకృష్ణ ఆధ్వర్యంలో కమిటీ చైర్మన్ వోడ్నాల తిరుపతి నేతృత్వంలో ఉదయం నుండి వేదోక్త స్మార్త సంప్రదాయరీతిలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామునికి, సీతాదేవికి లోకకల్యాణార్థం జరిపించిన కల్యాణ మహోత్సవానికి వేలాదిమంది భక్తులు హాజరై కన్నులారా చూసి తరించారు. 

దేవస్థానంలో..

ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో సీతారామ, లక్ష్మీ నరసింహ స్వాముల కల్యాణ వేడు కలు  ఒకే వేదికపై ఒకే మహూర్తాన కన్నుల పండువగా జరిగాయి.
 దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు జక్కు రవీందర్,  ధర్మకర్తల మండలి సభ్యులు ఏదులాపురం మహేందర్, బాదినేని వెంకటేష్, బొల్లారపు పోచయ్య, గుడ్ల రవీందర్, కొమురెల్లి పవన్ కుమార్, మందుల మల్లేష్, నేదునూరి శ్రీధర్, రాపర్తి సాయి కిరణ్, స్తంభంకాడి గణేష్, సంబెట తిరుపతి, ఒజ్జల సౌజన్య నరేందర్ గార్లు వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ,  ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు, అర్చకులు నంభి అరుణ్ కుమార్, చక్రపాణి కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్,   అర్చకులు సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కల్యాణ మూర్తులను వేద మంత్రాలతో, మంగళ వాద్యాలతో, శేషప్ప కళా వేదికపైకి తీసుకొచ్చి, శోడశోపచార సహిత పూజలతో, సాంప్రదాయ బద్దంగా కల్యాణం జరిపించారు. 

 తిమ్మాపూర్ లో

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పరిధిలోని తిమ్మాపూర్ రామాలయంలో రామ జన్మ, కళ్యాణ వేడుకలకలను బ్రహ్మోత్సవాలలో బాగంగా నిర్వహించారు. అర్చకులు నేరెళ్ళ వంశీకృష్ణ, మోహన్,  బొజ్జా రాజ గోపాల్ శర్మ,  కళ్యాణం జరిపించారు. 


 మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు తనయులు నర్సింగ్ రావు, కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే జైనా, దొంతాపూర్, గండి హన్మాన్ ఆలయాల్లో సీతారామ కళ్యాణ వేడుకలు నిర్వహించారు 

సాయి జన్మ దిన వేడుకలు

ధర్మపురి క్షేత్రస్థ గోదావరీ నదీ తీరస్థ శ్రీసాయి బాలాజీ మందిరంలో  సాయిబాబా జన్మదిన వేడుకలు వైభ వంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపక నిర్మాత ఒజ్జల ప్రవీణ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో, ట్రస్టు అధ్యక్షుడు గోలి రాంప్రసాద్ నిర్వహణలో, అర్చకులు, స్థానిక వేద పండితులు ఆకర్ష్ శర్మ, అక్షయ్ శర్మలు, ప్రత్యేక పూజలు, జన్మదిన అర్చనలు నిర్వహించారు. మహా క్షీరాభిషేక కార్యక్రమంలో అశేష భక్తజనులు స్వహస్తాలతో, సాయినాథున్ని క్షీరాభిషిక్తుడిని చేసి తరించారు. ఈ సందర్భంగా నివేదనలు సమర్పించారు.

Tags

More News...

Local News 

కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ

కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ సానుకూలంగా స్పందించిన డిఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య
Read More...
Local News 

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది - ముల్కనూర్ పిహెచ్సి వైద్యులు డాక్టర్ ప్రదీప్ రెడ్డి
Read More...
Local News 

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి 

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి  గొల్లపల్లి ఎప్రిల్ 16 (ప్రజా మంటలు): ధర్మపురి మండలం ధమ్మన్నపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్ళి అక్కడ ఇటీవల హత్యకు గురికాగ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  బుధవారం రోజున శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు....
Read More...
Local News 

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర సికింద్రాబాద్  ఏప్రిల్ 16 (ప్రజా మంటలు):  దశాబ్దల తరబడిగా ముదిరాజులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ఈ నెల 18 నుంచి ముదిరాజ్ నాయకులు యువరాజ్ పాదయాత్ర చేపట్టబోతున్నారు.  మేడారం సమ్మక్క సారక్క క్షేత్రం నుండి పాదయాత్ర ప్రారంభం అవుతుందని జాతీయ కోలీ సమాజ్ ఈసీ నెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్ తెలిపారు. మేడారం...
Read More...
Local News 

కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం

కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో చేస్తున్న యాత్రలు బూటకం - బిజెపి నాయకురాలు రాజేశ్వరి  సికింద్రాబాద్ ఏప్రిల్ 16 (ప్రజా మంటలు): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబెడ్కర్ ను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అవమానించారని ఆయనను కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని కాంగ్రెస్ నాయకులు...
Read More...
Local News 

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గొల్లపల్లి ఎప్రిల్ 16 (ప్రజా మంటలు): ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు బుధవారం గొల్లపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు....
Read More...
Local News 

పోషణ పక్వాడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథి సిడిపిఓ వీరలక్ష్మి

పోషణ పక్వాడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథి సిడిపిఓ వీరలక్ష్మి గొల్లపల్లి ఎప్రిల్ 16 :(ప్రజా మంటలు) గొల్లపల్లి మండలం  లోని తిరుమలాపూర్ అంగన్వాడీ సెంటర్ లో పోషణ పక్వాడ్ ప్రోగ్రాము లో ముఖ్య అతిధిగా మల్యాల సీడీపీఓ వీరలక్మి మాట్లాడుతూ 1000 రోజుల ప్రాముఖ్యత ను తెలియచేస్తు గర్భిణీలు పౌష్టిక ఆహారం, చిరు ధన్యలను ఉపయోగించి అనుబంధ ఆహార వంటలు చేయటం పట్ల అవగాహనా కల్పించారు...
Read More...
Local News  State News 

ఎల్కతుర్తి సభకు గులాబీ సైనికులారా తరలిరండి - ఎమ్మెల్సీ కవిత గోడమీద రాతలు

ఎల్కతుర్తి సభకు గులాబీ సైనికులారా తరలిరండి - ఎమ్మెల్సీ కవిత గోడమీద రాతలు జగిత్యాల ఎప్రిల్ 16: ఈనెల 27న వరంగల్ లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలి వెళదాం.25 ఏళ్ల గులాబీ పండుగను విజయవంతం చేద్దాం. కార్యకర్తల్లారా తరలి రండి అంటూ BRS నాయకురాలు,ఎమ్మెల్సీ కవిత గోడమీద రాస్తూ, కార్యకర్తలను ఉత్సాహపరిచారు. కౌన్సిలర్ దేవేందర్ నాయక్, ఇతర కార్యకర్తలు వెంట ఉన్నారు. ఈరోజు జగిత్యాలలో జరిగే...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో పోషణ జాతర 

ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో పోషణ జాతర  ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 16 (ప్రజామంటలు దగ్గుల అశోక్) జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో బుధవారం రోజున సంఘ భవనంలో పోషణ అభయన్ లో భాగంగా పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ మణెమ్మ మాట్లాడుతూ మొదట 1000 రోజులు సంరక్షణ తల్లి బిడ్డలకు జీవిత కాలపు రక్షణ...
Read More...
State News 

కాంగ్రెస్ వాళ్లకు బెదిరింపులు, మోసం చేయడం కొత్త కాదు -  జగిత్యాల సభలో ఎమ్మెల్సీ కవిత 

కాంగ్రెస్ వాళ్లకు బెదిరింపులు, మోసం చేయడం కొత్త కాదు -  జగిత్యాల సభలో ఎమ్మెల్సీ కవిత  ఎల్కతుర్తిలో జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభ ను విజయవంతం చేయాలి తెలంగాణ ఇస్తాని చెప్పి 2004లో మోసం చేసిన కాంగ్రెస్... ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేస్తోంది జగిత్యాలలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో పాల్పొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల ఎప్రిల్ 16: బిఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం జగిత్యాలలో జిల్లా...
Read More...
National  International  

ట్రంప్ నిబంధనలను వ్యతిరేకించిన  హార్వర్డ్ విశ్వవిద్యాలయ యాజమాన్యాన్ని  అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా  ప్రశంసించారు

ట్రంప్ నిబంధనలను వ్యతిరేకించిన  హార్వర్డ్ విశ్వవిద్యాలయ యాజమాన్యాన్ని  అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా  ప్రశంసించారు ట్రంప్ మంగళవారం విశ్వవిద్యాలయం తన పన్ను మినహాయింపు హోదాను కోల్పోవాలని  సూచించాడు. ఏప్రిల్ 15, డిమాండ్లను ధిక్కరించిన తర్వాత వైట్ హౌస్ హార్వర్డ్‌కు నిధులను స్తంభింపజేసింది ట్రంప్ పరిపాలన $2 బిలియన్లకు పైగా ఫెడరల్ గ్రాంట్ డబ్బును స్తంభింపజేసింది.. యూదు వ్యతిరేకతపై చర్య తీసుకోలేదని ఆరోపిస్తూ విశ్వవిద్యాలయం నిధుల స్తంభనను ఎదుర్కొంటున్నందున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...
Read More...
State News 

ఏసీబీకి చిక్కిన. చాంద్రాయణగుట్ట అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్

ఏసీబీకి చిక్కిన. చాంద్రాయణగుట్ట  అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్    హైదరాబాద్ ఏప్రిల్ 15: శేరిలింగంపల్లి జోనల్ మున్సిపల్ కార్యాలయంలో అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ ఏసీబీ వలకు చిక్కారు.   రూ.70 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.  చార్మినార్ జోన్ ఇన్ఛార్జిగా శ్రీనివాస్.అదనపు బాధ్యతలు  నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో చాంద్రాయణగుట్ట సర్కిల్లో అర్బన్ బయో డైవర్సిటీ విభాగంలో రూ. 45 లక్షల
Read More...