విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.
గొల్లపల్లి మార్చి 19 (ప్రజా మంటలు):
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్లన్న పేట పాఠశాల 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జగిత్యాల జిల్లా విద్యాధికారి రాము మాట్లాడుతూ,
రాబోయే పదవతరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి అత్యుత్తమ ఫలితాలు పొందాలని కోరారు.
విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన దిశగా విద్యార్థులు కష్టపడి భవిష్యత్తులో అత్యున్నత స్థానాన్ని చేరుకోవాలని ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి రాము, విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మండల విద్యాధికారి జమునా దేవి, సెక్టోరల్ అధికారులు చిప్ప సత్యనారాయణ, కొక్కుల రాజేష్, పాఠశాల ఉపాధ్యాయులు అమర్ నాథ్ రెడ్డి, కరుణాకర్, సుధాకర్, రాజేశం, హరికృష్ణ, సత్య, రవీందర్, బాలచంద్రుడు, కుమారస్వామి, చంద్రశేఖర్, శరత్ చందర్, విజయ, స్రవంతి, నందయ్య, రాజ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం

ప్రేమ పేరుతో వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య
.jpeg)
రామన్న జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం
