సీపీఆర్ చేసి పాదచారిని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు
సికింద్రాబాద్ మార్చి 16 (ప్రజామంటలు) :
అపస్మారక స్థితిలోకి వెళ్ళిన వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణలు కాపాడిన ట్రాఫిక్ పోలీసుల ఉదంతం ఇది..వివరాలు ఇవి.. బేగంపేట పీఎన్టీ జంక్షన్ వద్ద రోడ్డు దాటుతూ ఓ వ్యక్తి రోడ్డు పై పడిపోయడు. ఎండ తీవ్రత కారణంగా ఎండదెబ్బ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న బేగంపేట ట్రాఫిక్ సిఐ పాపయ్య వెంటనే అతడిని రోడ్డు పై నుంచి పక్కకు తీసుకువచ్చారు. ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు ఆనంద్, హైదర్ లు అతడికి సీపీఆర్ చేశారు. అతను అపస్మారక స్థితి నుంచి మాములు స్థితికి రాగానే వెంటనే అతన్ని 108 లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో డాక్టర్లు అతడికి ట్రీట్మెంట్ చేసి, సాయంత్రానికి డిశ్చార్జ్ చేశారు.
విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది వెంటనే స్పందించడంతో సీపీఆర్ ద్వారా అతన్ని ప్రాణలు కాపాడిగలిగారు . అతడి వద్ద ఉన్న మొబైల్ ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సదరు వ్యక్తి ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ కు చెందిన సురేష్ (27) గా పోలీసులు గుర్తించారు. అత్యవసర సమయంలో సీపీఆర్ చేసి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన ట్రాఫిక్ పోలీసులను అంతా అభినందిస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జి రాజేశం గౌడ్

బుగ్గారం సర్పంచ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయండి

బ్రహ్మోత్సవాలలో మొక్కులు తీర్చుకున్న భక్తులు, బ్రహ్మ పుష్కరిణిలో... కోనేటి రాయుని జలవిహారం

సీపీఆర్ చేసి పాదచారిని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు

ఆడపిల్లల చదువు ఎంతో ముఖ్యం - కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

సి ఎం సహాయనిది చెక్కులు నిరుపేదలకు వరం ఎమ్మెల్యే డా. సంజయ్

గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్

విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి డిఆర్డి ఎపిడి రఘువరన్

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థులకు సులభతర విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
