అవినీతి, రాజకీయాల రహితంగా ధర్మపురి దేవస్థానం
లక్ష్మీ నరసింహునిపై ట్రస్టు బోర్డు చైర్మన్ ప్రమాణం
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి మార్చ్ 13:
నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా భాసిల్లుతున్న సహస్రాబ్దుల పౌరాణిక చారిత్రక, ఐతిహాసిక నేపథ్యాన్ని కలిగి ఉన్న ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో అవినీతి, రాజకీయాలకు తావు లేకుండా కృషి చేయ గలమని ధర్మకర్తల మండలి చైర్మన్ జక్కు రవీందర్ దైవ సాక్షిగా ప్రమాణం చేశారు.
రాష్ట్ర దేవదాయ శాఖ ఉత్తర్వుల సంఖ్య జీ ఓ నెం.76 తేదీ 11.03.2025 మరియు దేవాదాయ కమిషనర్ ఉత్తర్వులు సంఖ్య ఎఫ్ 5/ 694/ 2024 తేదీ 12.3.2025
ద్వారా నియమిత కమిటీలో సీనియర్ నాయకులు, జిల్లా ఆర్యవైశ్య నేత జక్కు రవీందర్, ఎదులాపురం మహేందర్, బా దినేని సత్యనారాయణ, బొల్లారపు పోచయ్య, గుడ్ల రవీందర్, మందుల మల్లేష్, రాపర్తి సాయి కిరణ్, స్తంభంకాడి గణేష్, సంబెట తిరుపతి,
దాసు మల్లేష్, వొజ్జల సౌజన్య,
కొమురెల్లి పవన్ కుమార్, నేదునూరి
శ్రీధర్ లతో కూడిన 13 మందితో పాటు ఉప ప్రధాన అర్చకులు నేరెల్ల శ్రీనివాసా చార్య సభ్యులు ఉన్నారు.
ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం గురువారం దేవస్థానంలో శేషప్ప కళా వేదికపై, ఈఓ శ్రీనివాస్ సంకటాల నిర్వహణలో... కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ నాయిని సుప్రియ నూతన ధర్మ కర్తలతో ప్రమాణం చేయించారు. 13మంది సభ్యులతో పాటు ఉప ప్రధాన అర్చకులు నేరేల్ల శ్రీనివాసా చార్య ఎక్స్ అఫిషియో సభ్యులుగా ప్రమాణం చేశారు. అనంతరం ధర్మకర్త కొమిరెల్లి పవన్ ప్రతిపాదించి, నేదునూరి శ్రీధర్ బలపరిచిన అభ్యర్థి జక్కు రవీందర్ ధర్మ కర్తల మండలి చైర్మన్ గా ఎన్నికైనారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ...తమపై విశ్వాసం ఉంచి, భగవత్ సేవ అవకాశం కల్పించిన ఎమ్మేల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కు, సహకరించి ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డికి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయక, ఇలాంటి మచ్చ రానీయకుండా, దేవస్థానం అభివృద్దికి అహరహం శ్రమించి, ప్రగతి పథంలో నడిపేందుకు కంకణ ధారులమై ఉన్నా మన్నారు. దేవస్థానం పక్షాన చైర్మన్, ధర్మ కర్తలను సన్మానించారు. దైవ దర్శనాలు చేయించి, ప్రసాదాలు అందజేశారు. చైర్మన్ ఛాంబర్ లో ఉచిత ఆసనాలలో ఆశీనుల గావించారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు తరలి వచ్చారు. చైర్మన్ ధర్మ కర్తలను వ్యక్తిగతంగా పలువురు అభినందించి, సన్మానించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రంగుల పండుగలో బీ కేర్ ఫుల్...డాక్టర్ కళ్యాణ చక్రవర్తి

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,

గాంధీ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు ఉన్నాయి- జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పోషించని కొడుకులపై జగిత్యాల ఆర్డీవోకు తల్లిదండ్రుల ఫిర్యాదు.

నేటి నుండి ధర్మపు రీశుల తెప్పోత్సవాలు

అవినీతి, రాజకీయాల రహితంగా ధర్మపురి దేవస్థానం

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్రోత్సవము ముగింపు

అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి

బౌద్దనగర్ కార్పొరేటర్ కంది శైలజ పర్యటన
