పోషించని కొడుకులపై జగిత్యాల ఆర్డీవోకు తల్లిదండ్రుల ఫిర్యాదు.
జగిత్యాల మార్చి 13:
పోషించక,వేధింపులకు గురిచేస్తున్న ఇద్దరు కొడుకులపై మల్యాల మండలం పోతారం గ్రామానికి చెందిన నిమ్మ నర్సయ్య (75,) నిమ్మ భూమక్క (73) అనే వృద్ధ తల్లిదండ్రులు గురువారం జగిత్యాల డివిజన్ ఆర్డీవో మధుసూదన్ కు ఫిర్యాదు చేశారు..అనంతరం సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ను కలిసి తన గోడు వెళ్ళబోసుకున్నాడు.
ఈ సందర్భంగా ఆ తల్లిదండ్రుల వెంట సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ వెళ్ళగా ఆయన సాయం తో ఆర్డీవో కు తమ గోడు వినిపిస్తూ విలపించారు..తమకు ఇద్దరు కొడుకులని పెద్ద కొడుకు మాడ రాజరెడ్డి,చిన్న కొడుకు నిమ్మ వెంకటేష్ లకు చెరి 2 ఎకరాల 12 గుంటల భూములు పంచి ఇచ్చానని,అంతే కాక చెరి ఒక ఇల్లు కట్టించానని,తల్లిదండ్రులమయిన మాకు మాత్రం వారి నివాసాల్లో చోటివ్వలేదని,చిన్న కొడుకు ఇంటి ముందున్న చిన్న గది లో ఉంటున్న తమకు ఇద్దరు కొడుకులు తిండి పెట్టడం లేదని,చక్కెర,బీపీ.వ్యాధులతో బాధలు పడుతున్నామన్నారు.
మా పేరిట ఉంచుకున్న 26 గుంటల భూమిని మేము సాగు చేసుకోనీయకుండా ఇద్దరు కొడుకులు అడ్డుకోవడమే కాకుండా మాకు గ్రామ పెద్ద మనుషుల ముందు ఇద్దరు కొడుకు లు కలిసి ఏడాదికి రూ.50 వేలు పోషణ,వైద్య ఖర్చుల కింద ఇస్తామని ఒప్పందం కాగా డబ్బులు ఇవ్వాలని అడిగితే తీవ్రంగా మా భార్యాభర్తలను కొడుతున్నారని,మా పేరిట ఉన్న భూమిని సైతం సాగు చేసుకొనకుండ ఇద్దరు కొడుకులు అడ్డుపడుతున్న పరిస్థితి లో అనారోగ్యంతో బాధలు పడుతున్న తాము పోషణ,వైద్య ఖర్చుల కోసం పలు ఇబ్బందులు పడుతున్నామని,మా ఇద్దరు కొడుకుల నుంచి చెరి రూ.25 వేలు ఇప్పించాలని,మా పేరిట ఉన్న 26 గుంటల భూమిని మేమే సాగు చేసుకునేలా మా ఇద్దరు కొడుకులపై చట్టపర చర్యలు తీసుకోవాలని వేడుకొన్నారు.
ఆర్డీవో వెంటనే స్పందించి కనికరం లేని ఆ ఇద్దరు కొడుకులపై వయో వృద్ధుల పోషణ సంరక్షణ చట్టం సెక్షన్ 2(బి),సెక్షన్ 4(1),సెక్షన్ 24 ప్రకారం కేసు నమోదుకు,వారికి నోటీసులు జారీకి ఆదేశించారు.వయో వృద్ధులైన తల్లిదండ్రుల పోషణ బాధ్యత పిల్లలదేనని,విస్మరిస్తే జైలు శిక్ష,జరిమానా తదితర చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఆ తల్లిదండ్రుల వెంట వెంట సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు, జిల్లా కాన్సిలియేషన్ అధికారి హరి ఆశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం ,ఆ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రంగుల పండుగలో బీ కేర్ ఫుల్...డాక్టర్ కళ్యాణ చక్రవర్తి

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,

గాంధీ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు ఉన్నాయి- జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పోషించని కొడుకులపై జగిత్యాల ఆర్డీవోకు తల్లిదండ్రుల ఫిర్యాదు.

నేటి నుండి ధర్మపు రీశుల తెప్పోత్సవాలు

అవినీతి, రాజకీయాల రహితంగా ధర్మపురి దేవస్థానం

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్రోత్సవము ముగింపు

అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి

బౌద్దనగర్ కార్పొరేటర్ కంది శైలజ పర్యటన
