బుగ్గారం సర్పంచ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయండి
ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్
ఏళ్ళతరబడి పోరాట ఫలితం
బుగ్గారం/జగిత్యాల మార్చ్ 16 (ప్రజా మంటలు జిల్లా ప్రతినిధి) :
జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ మూల సుమలత పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
గ్రామ పంచాయతీలో భారీగా నిధులు దుర్వినియోగం అయిన కారణంగా చుక్క గంగారెడ్డి పిర్యాదుల మేరకు లోకాయుక్త న్యాయస్థానం యొక్క జస్టిస్ సి. వి.రాములు గత డిసెంబర్ 6న జడ్జిమెంట్ జారీ చేశారు.
బుగ్గారం గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం, అవకతవకలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జడ్జిమెంట్ లో ఆదేశించారు. వ్యక్తిగతంగా నిధుల దుర్వినియోగాన్ని పరిశీలించి తగు కఠిన చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్‌ను లోకాయుక్త జస్టిస్ సి.వి.రాములు జారీ చేసిన ఉత్తర్వులలో ఆదేశించారు.
లోకాయుక్త తీర్పు ప్రకారం నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ బుగ్గారం తాజా మాజీ సర్పంచ్ మూల సుమలత పై క్రిమినల్ కేసు నమోదు చేయుటకు బుగ్గారం మండల పంచాయతీ అధికారికి ఈనెల 10న జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ క్రిమినల్ కేసులపై తీసుకున్న చర్యల వివరాలను ఏడు రోజులలోగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అందజేయాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.
కాగా... మండల పంచాయతీ అధికారి అఫ్జల్ మియా గత వారం రోజుల నుండి కాలక్షేపం చేస్తూ నేటికీ ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయక పోవడం పలు అనుమానాలకు, పలు ఆరోపణలకు దారి తీస్తోంది.
గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంలో ఎంపీఓ అఫ్జల్ మియా కూడా వాటా దారుడేనని పిర్యాదు దారుడు చుక్క గంగారెడ్డి ఆరోపించారు.
గతంలోనే ఎంపీవో పలు ఆరోపణలు ఎదుర్కొన్నారని ఆయన వివరించారు. స్వయంగా జిల్లా కలెక్టర్ కు ఎంపిఓ పై ఆధారాలతో సహా పిర్యాదులు కూడా చేయడం జరిగిందని పిర్యాదు దారుడు చుక్క గంగారెడ్డి తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జి రాజేశం గౌడ్

బుగ్గారం సర్పంచ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయండి

బ్రహ్మోత్సవాలలో మొక్కులు తీర్చుకున్న భక్తులు, బ్రహ్మ పుష్కరిణిలో... కోనేటి రాయుని జలవిహారం

సీపీఆర్ చేసి పాదచారిని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు

ఆడపిల్లల చదువు ఎంతో ముఖ్యం - కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

సి ఎం సహాయనిది చెక్కులు నిరుపేదలకు వరం ఎమ్మెల్యే డా. సంజయ్

గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్

విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి డిఆర్డి ఎపిడి రఘువరన్

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థులకు సులభతర విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
