వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పట్టుకున్న పోలీసులు
వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పట్టుకున్న పోలీసులు
మెట్టుపల్లి ఫిబ్రవరి 15 (ప్రజా మంటలు).
మెట్టుపల్లి సబ్ డివిజన్ పరిధిలో ఇటీవల జరిగిన వరుస దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.6 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఈ వివరాలను వెల్లడించారు.
మెట్టుపల్లి సబ్ డివిజన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇళ్లు, మోటార్ సైకిళ్లు, వ్యవసాయ కరెంటు మోటార్ల దొంగతనాలు ఇటీవల పెరిగాయని, ప్రజల మరియు రైతుల నుండి ఫిర్యాదులు రావడంతో, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక దృష్టి సాధించి మెట్టుపల్లి డీఎస్పీ రాములు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ బృందానికి మెట్టుపల్లి సీఐ నిరంజన్ రెడ్డి నేతృత్వం వహించి, సీసీటీవీ ఫుటేజీలు మరియు ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ రోజు ఉదయం ఇబ్రహీంపట్నం ఎక్స్ రోడ్డు వద్ద ఇబ్రహీంపట్నం ఎస్సై ఏ. అనిల్ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా, వారు దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. వీరు మెట్పల్లికి చెందిన స్క్రాప్ వ్యాపారితో కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తేలింది.
నిందితులు మెట్టుపల్లి , ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కథలాపూర్ మండలాల పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగిలించిన వస్తువులను స్క్రాప్ వ్యాపారికి విక్రయించి, డబ్బులు పంచుకునేవారని తెలిపారు. నిందితుల వివరాలు తెలియజేస్తూ, A-1: కుంచేపు వెంకటేష్ మెట్టుపల్లి డి డి నగర్ కాలనీ, A-2: సూర్యవంశీ సాయికుమార్ స్వస్థలం: ఏ ఆర్ పి క్యాంపు, ఎడపల్లి, నిజామాబాదు జిల్లా, ప్రస్తుత చిరునామా: రాఘవిపేట గ్రా., మల్లాపూర్ మం,, A-3: అబ్దుల్ బారి రెడ్డి కాలనీ,మెట్టుపల్లి వీరి నుండి రూ.5,000, ఒక మోటార్ సైకిల్, 30 కిలోల కాపర్ వైర్ మరియు 30 వ్యవసాయ కరెంటు మోటార్లు స్వాధీనం చేసుకునగా వీటి మొత్తం విలువ: రూ.6 లక్షలు. ఉంటుందని తెలిపారు. ఈ కేసును తక్కువ సమయంలో ఛేదించిన డీఎస్పీ రాములు, సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సై అనిల్, ఎస్సై కిరణ్, ఎస్సై రాజు, సిబ్బంది చైతన్య, కిరణ్, అనిల్, సాధు నాయక్ మరియు మారుతీ జిల్లా ఎస్పీ అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు ..... కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్
