పెద్ధపూర్ జాతరకి వచ్చే భక్తులకు భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలి.
భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
కోరుట్ల మార్చ్ 15( ప్రజా మంటలు)
కోరుట్ల పోలీస్ స్టేషన్ ని పెద్ధపూర్ గ్రామంలో గల పుణ్యక్షేత్రం మల్లన స్వామి (పెద్ధపూర్ జాతర) సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎస్పీ జాతర ఏర్పాట్లను సమీక్షించి, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు, పార్కింగ్ సౌకర్యాలు, అత్యవసర సేవలు, పోలీసు బందోబస్తు వంటి అంశాలను పరిశీలించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.భద్రతా ఏర్పాట్లలో భాగంగా సీసీ కెమెరా పర్యవేక్షణ, ప్రత్యేక పోలీస్ బృందాలు, శాంతి భద్రతల పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు.భక్తుల భద్రత, సౌకర్యం కోసం పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు అన్నారు.ప్రతి ఒక్కరు పోలీసుల సూచనలు పాటించి, శాంతి భద్రతలు కాపాడేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించినా తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ శ్రీ మల్లన స్వామిని దర్శించుకున్నారు.
ఎస్పీ వెంట డిఎస్పి రాములు , సి.ఐ సురేష్ , ఎస్.ఐలు శ్రీకాంత్, శ్యామ్ రాజ్ , నవీన్ ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి డిఆర్డి ఎపిడి రఘువరన్

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థులకు సులభతర విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

పెద్ధపూర్ జాతరకి వచ్చే భక్తులకు భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలి.

*ఘనంగా కాన్షీరాం 91 వ, జయంతి వేడుకలు

రేపే మల్లన్న జాతర, యాదవుల కుల దైవం మల్లన్న

యువత " మై భారత్ పోర్టల్ " ద్వారా యూత్ పార్లమెంట్ అవకాశాన్ని వినియోగించుకోవాలి. - కేంద్రమంత్రి బండి సంజయ్

గాంధీలో గ్లకోమా నివారణ వారోత్సవాలు - డాక్టర్లతో అవెర్నెస్ ర్యాలీ

మీసేవ సెంటర్ ను తనిఖీ చేసిన తహసిల్దార్ ప్రసాద్.

మెట్‌పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ
