సోషల్ వర్క్ కోర్సు ను ఆర్ట్స్ కళాశాల కు తరలించాలి
వీసీ, రిజిస్ట్రార్ లకు ఏబీవీపీ వినతి
సికింద్రాబాద్ మార్చి 15 ( lప్రజామంటలు):
యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలలో 2004 నుంచి నడుపుతున్న మాస్టర్ అఫ్ సోషల్ వర్క్ కోర్స్ ను యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల, మెయిన్ క్యాంపస్ తార్నాక కు మార్చాలని అఖిల భారతీయ విద్యార్థి సంఘం (ఏబీవీపీ) ఆధ్వర్యంలో శనివారం వైస్ ఛాన్సెలర్ ప్రొ. యం. కుమార్, రిజిస్ర్టార్ ప్రొ. నరేష్ రెడ్డి లకు వినతిపత్రం ఇచ్చారు. సోషల్ కోర్స్ ప్రారంభం నుంచి పీజీ కళాశాల లో ఉండటం నేటికీ దాదాపు ఇరవై ఏండ్లు గా సెల్ఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గా ఉండటం వలన తగిన గుర్తింపు, గౌరవం, అదునాతన లైబ్రరీ, అకాడమిక్ లో సరైన మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. కాబట్టి తక్షణమే మాస్టర్ అఫ్ సోషల్ వర్క్ (సంఘ సంక్షేమ శాస్త్రం) కోర్సు బదిలీ చేస్తూ, బడ్జెట్ కోర్సుగా మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జి. జీవన్, అలివేలు రాజు, ధ్రువన్ పృథ్వి బాలకృష్ణ, కదం పాండు రంగా పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి డిఆర్డి ఎపిడి రఘువరన్

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థులకు సులభతర విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

పెద్ధపూర్ జాతరకి వచ్చే భక్తులకు భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలి.

*ఘనంగా కాన్షీరాం 91 వ, జయంతి వేడుకలు

రేపే మల్లన్న జాతర, యాదవుల కుల దైవం మల్లన్న

యువత " మై భారత్ పోర్టల్ " ద్వారా యూత్ పార్లమెంట్ అవకాశాన్ని వినియోగించుకోవాలి. - కేంద్రమంత్రి బండి సంజయ్

గాంధీలో గ్లకోమా నివారణ వారోత్సవాలు - డాక్టర్లతో అవెర్నెస్ ర్యాలీ

మీసేవ సెంటర్ ను తనిఖీ చేసిన తహసిల్దార్ ప్రసాద్.

మెట్‌పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ
