అబద్దాలను ప్రచారం చేయడం ముఖ్యమంత్రికి తగదు
మోడీ కులం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు
బిజెపి రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ రాజేశ్వరి
సికింద్రాబాద్ ఫిబ్రవరి 15 (ప్రజామంటలు):
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ కులానికి చెందినవారు కాదని లీగల్లీ కన్వెర్టెడ్ బిసి అని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనాయకులు అయినా సోనియా, రాహుల్, ప్రియాంకలు ఏ కులానికి చెందినవారో స్పష్టం చేయాలని బిజెపి రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి డిమాండ్ చేశారు.
తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏఒక్క పథకం కూడా అమలు చేయలేదని కానీ అన్ని అమలు చేసినట్లుగా అబద్దాలు ప్రచారం చేయడం ముఖ్యమంత్రికి తగదని అన్నారు. గత ఖరీఫ్ లో ఇవ్వాల్సిన రైతు భరోసా ఇవ్వలేదని ఇప్పుడు గత ఖరీఫ్ సీజన్ మరియు ప్రస్తుత రబీ సీజన్ రెండు పంటలకు కలిపి పన్నెండు వేలు రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకోవాలని అన్నారు.
పేదవారికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని ఖాళీ జాగా ఉంటే అయిదు లక్షలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఏఒక్కరికి ఇవ్వలేదని అన్నారు.అయిదు వందలకే సిలిండర్ ఇవ్వడం లేదని అన్ని రకాల వడ్లకు అయిదు వందలు బోనస్ అని కేవలం సన్న వడ్లకు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని అన్నారు.దేశంలో తెలంగాణా రాష్టం తప్ప ఏరాష్ట్రము రుణమాఫీ చేయలేదని గప్పాలు కొడుతూ రైతు రుణమాఫీ కొందరికే చేసి అందరికి చేసినట్లు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.భూమిలేని వ్యవసాయ కూలీలకు,
ఆటో డ్రైవర్లకు ఏటా పన్నెండు వేల చొప్పున ఇస్తామని ఇంతవరకు ఏఒక్కరికి ఇవ్వలేదని ఒకవేళ ఇచ్చినట్లయితే చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కామారెడ్డి ప్రజలు ఒక్క కేసీఆర్ ఒక్కరినే బండకేసి కొట్టలేదని రేవంత్ రెడ్డిని కూడా బండకేసి కొట్టిన విషయం మరచిపోకూడదు అన్నారు. 1931లో బ్రిటిష్ కాలంలో కులగణన జరిగితే 95 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసిందని బిజెపి ప్రభుత్వం మూడు సార్లు అధికారంలోకి వచ్చిన ఎందుకు చేయలేదని ప్రశ్నించడం సిగ్గుచేటని అరవై ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కులగణన చేయకుండా గుడ్డి గుర్రాల పండ్లు తోమిండ్రా అని ఎద్దేవాచేశారు.
ఎస్సీ వర్గీకరణ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పడం మందికి పుట్టిన పిల్లల్ని మనకు పుట్టిన పిల్లలు అని సంబుర పడ్డట్టుందని అన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు నిధులు తేవడం లేదని ముఖ్యమంత్రి ఆరోపిస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేంద్రం నుండి పది నెలల్లో యాభై వేల కోట్లు నిధులు కేంద్రం నుండి తెచ్చాం అనడం ఇందుకు నిదర్శనం అన్నారు. తెలంగాణా రాష్టం నుండి వంద కోట్ల నిధులు పన్నుల రూపంలో పోతుంటే 42%మాత్రమే రాష్ట్రానికి తిరిగి ఇస్తున్నారని ఇది అన్యాయం అన్న ముఖ్యమంత్రి తెలంగాణాలో అత్యధిక ఆదాయం హైదరాబాద్ నగరం నుండి మాత్రమే వస్తుందని అలాంటప్పుడు హైదరాబాద్ నగర అభివృద్ధికే ఖర్చు చేయకుండా మిగతా జిల్లాలలోని 118 నియోజకవర్గాలకు అంతంత మాత్రమే ఇచ్చి ఒక్క కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు ఎందుకు వెచ్చిస్తున్నారని ప్రశ్నించారు.ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక కేంద్రంపై విమర్శలు చేయడం మానుకోవాలని ప్రపంచంలోనే అతిపెద్ద దేశం అయిన అమెరికా నరేంద్ర మోడీకి ఇచ్చిన గౌరవాన్ని జీర్ణించుకోలేక చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా స్టేట్ కో కన్వీనర్ సరోజ, మెట్టుగూడ డివిజన్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆవుల గణేష్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు
