క్షేత్రస్థాయిలో మహిళా కాంగ్రెస్ ను బలోపేతం చేయాలి రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతా రావు
జగిత్యాల , హైదరాబాద్ ఫిబ్రవరి 17(ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లాలో మహిళా కాంగ్రెస్ ను బలోపేతం చెయ్యాలని మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతా రావు జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకత్వానికి దిశా నిర్దేశం చేశారు.
హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో సోమవారం జిల్లాలోని వివిధ హోదాల మహిళా సంఘాల బాధ్యులకు నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్బంగా సునీత రావు మాట్లాడుతూ జిల్లాలో సభ్యత్వం నమోదు ప్రక్రియను వేగవంతం చెయ్యాలని సూచించారు. ప్రస్తుతం సభ్యత్వం నమోదు ఆశించిన స్థాయిలో ఉందని, కానీ దేశంలోనే తెలంగాణ మహిళ కాంగ్రెస్ విభాగం ను ముందు వరుసలో నిలబెట్టేందుకు మరింత కృషి చెయ్యాల్సిన అవసరం ఉందనే భావనతో మరింత సభ్యత్వ నమోదును పెంచాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోని వివిధ హోదాల్లో ఉన్న మహిళా కాంగ్రెస్ బాధ్యులు తమ తమ టార్గెట్ ను పూర్తి చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమం లో కరీంనగర్, జగిత్యాల ఇంచార్జి సుగుణ, పట్టణ మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు పిప్పరి అనిత తో పాటు కోరుట్ల, మెట్ పెల్లి మహిళా కాంగ్రెస్ బాధ్యులు కవిత , హరిత, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు సోగ్రాభి పెగడపెల్లి మండల అధ్యక్షురాలు విజయలక్ష్మి పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మానసిక పరిపక్వత,సమగ్రాభివృద్ధి క్రీడలతోనే సాధ్యం - ముత్యం రెడ్డి

ధర్మపురిలో శ్రీయోగానంద నరసింహుని తెప్పోత్సవ, డోలోత్సవం

అల వైకుంఠపురం...ఇల ధర్మపురి.. భక్తజన సంద్రమైన క్షేత్రం

జాతర ఉత్సవములో పాల్గొని పూజలు నిర్వహించిన పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత

హోళి పండుగ అందరికి కొత్త ఉత్సాహం ఇవ్వాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
.jpg)
జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో అర్ధరాత్రి జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా
1.jpg)
జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో అర్ధరాత్రి జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా
.jpg)
ధన్వంతరి ఆలయం లో ఘనంగా కుంకుమ అర్చన, హోళి వేడుకలు పాల్గొన్న పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత
.jpg)
ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం

రంగుల పండుగలో బీ కేర్ ఫుల్...డాక్టర్ కళ్యాణ చక్రవర్తి

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,
