మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని కవిత విమర్శ
మహిళలను మోసం చేశామని ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటు -
*కాంగ్రెస్ మెనిఫెస్టో చిత్తుకాగితమని తేలిపోయింది*
*మహిళా వ్యతిరేక సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలుస్తారు
శాసన మండలి సాక్షిగా బయటపడ్డ కాంగ్రెస్ బండారం
మిర్చికి 25 వేల మద్ధతు ధర ప్రకటించాలి: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ మార్చ్ 17:
మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మహిళా వ్యతిరేక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని స్పష్టం చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో దురుసుగా మాట్లాడడమే కాకుండా ఈ రోజు స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర: మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయబోమని చెప్పకనే చెప్పారని ఆక్షేపించారు.
కాంగ్రెస్ పార్టీ తన మెనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కళ్యాణమస్తు పథకం పేరిట పెండ్లి సందర్భంగా ఆడపిల్లలకు రూ. లక్షతో పాటు తులం బంగారం ఎప్పుటి నుంచి ఇస్తారని, ఇప్పటి వరకు జరిగిన వివాహాలకు కూడా ఇస్తారా లేదా అని సోమవారం నాడు శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానమిస్తూ... ఆ పథకాన్ని అమలు చేసే ఆలోచన లేదని తెలిపారు. దాంతో ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాసన మండలి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... కాంగ్రెస్ మెనిఫెస్టో చిత్తుకాగితమని తేలిపోయిందని, ప్రజలను, ముఖ్యంగా మహిళలను మోసం చేయడానికే ఇబ్బడి ముబ్బడిగా కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చిందని విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఖురాన్, బైబిల్, భగవద్గీత తో సమానం అని పదే పదే అంటున్నారని, కానీ అవన్నీ అబద్దాలేనని శాసన మండలి సాక్షిగా బయటపడిందని తెలిపారు. కళ్యాణమస్తు పథకమే కాకుండా మహిళలకు నెలకు 2500 ఇస్తామన్న హామీ, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్న హామీలు అమలుపై అనుమానాలు నెలకొన్నాయని, ప్రభుత్వ వైఖరి గమనిస్తే మహిళలను చిన్నచూపు చూస్తున్నట్లు కనిపిస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలు తప్పకుండా బుద్దిచెబుతారని హెచ్చరించారు.
ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని, మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఏ మాతరం చిత్తశుద్ది లేదనడానికి ఈ ఉదంతమే నిదర్శనమని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ గారు ఆడబిడ్డలకు అండగా నిలబడ్డారని, తల్లిదండ్రులకు అండగా పాప పుట్టునప్పటి నుండి పెళ్లి అయ్యే వరకు కేసీఆర్ గారు వారికి వెన్నుదన్నుగా నిలిచారని గుర్తు చేశారు.
మరోవైపు, మిర్చి పంటకు రూ. 25 వేలు కనీస మద్ధతు ధర ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మిర్చి ధరలు పడిపోయి రైతులు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి నిరసనగా సహచర బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కలిసి ఎమ్మెల్సీ కవిత శాసన మండలి ఆవరణలో ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎండు మిర్చి దండలను మెడకు వేసుకొని ఎమ్మెల్సీలు విన్నూత రీతిలో నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... మిర్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం సరికాదని సూచించారు. నాఫెడ్, మార్క్ ఫెడ్ వంటి సంస్థ ద్వారా ప్రభుత్వమే మిర్చి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సుగంధ ద్రవ్యాల బోర్డు పరిధిలోకి మిర్చి పంటను కూడా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. అలాగే, పసుపు పంటకు కూడా రూ. 15 వేల మేర కనీస మద్ధతు ధరను కల్పించాలని డిమాండ్ చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం

లైంగిక వేదింపులు కేసులో ఇద్దరికీ 2 నెలల జైలు శిక్ష
.jpeg)
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

ధరణి దరఖాస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు

ధర్మపురి స్వామివారి హోమశాలలో బ్రహ్మోత్సవ హవనాలు

విద్యకు బడ్జెట్ లో15 శాతం నిధులను కేటాయించాలి - ఎబివిపి

మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని కవిత విమర్శ

దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేత
.jpg)
భయం వీడితే విజయం మనదే...

సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవ, కళ్యాణ కరపత్రికను ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత
.jpg)