ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.
జగిత్యాల మార్చి 17(ప్రజా మంటలు)
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించి వెంటవెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్ బి.ఎస్.లత తో కలసి కలెక్టర్ స్వయంగా స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 35 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత ఆర్డీఓ లు మధు సుధన్, జివాకర్ రెడ్డి, కలెక్టరేట్ ఏ.ఓ హకీమ్ వివిధ జిల్లా అధికారులు, తహసీల్దార్లు,కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం

లైంగిక వేదింపులు కేసులో ఇద్దరికీ 2 నెలల జైలు శిక్ష
.jpeg)
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

ధరణి దరఖాస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు

ధర్మపురి స్వామివారి హోమశాలలో బ్రహ్మోత్సవ హవనాలు

విద్యకు బడ్జెట్ లో15 శాతం నిధులను కేటాయించాలి - ఎబివిపి

మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని కవిత విమర్శ

దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేత
.jpg)
భయం వీడితే విజయం మనదే...

సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవ, కళ్యాణ కరపత్రికను ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత
.jpg)