ధర్మపురి స్వామివారి హోమశాలలో బ్రహ్మోత్సవ హవనాలు
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
(రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494)
ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ (ఉగ్ర, యోగానంద), శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాల సందర్భంగా, దేవస్థానం లోని ప్రధానాలయాలలో సోమ వారం
విధివిదాన సాంప్రదాయ ప్రత్యేక పూజలొ నరించారు. దేవస్థాన యజ్ఞా చార్యులు కందాల పురుషోత్తమాచార్య, ఆస్థాన వేదపండితులు రమేశ శర్మ, ఆలయాల అర్చకులు నంబి శ్రీనివాసాచార్యులు, నేరెళ్ళ శ్రీనివాసా చార్యులు, రమణ, అశ్విన్, వంశీ కృష్ణ, అరుణ్, కిరణ్, మోహన్, వంశీ, విజయ్ వేదోక్త రీతిలో ఉత్సవ ప్రత్యేక అర్చనలు గావించారు. ఆస్థాన అర్చక పురోహితులు సంతోష్, సంపత్, రాజగోపాల్, ప్రవీణ్ నిత్య పూజలతోపాటు ద్వార తోరణాది హవనములు, స్వామికి శక్తిని కలుగజేసేందుకు హోమధూళిచే శక్తి హోమం, నక్షత్ర, నవగ్రహ సప్తజిహ్వ, షడంగ న్యాస, పంచసూక్త, పురుషసూక్త, శ్రీసూక్త, భూసూక్త, నీలాసూక్త, పరివార హోమాలు, సర్వ సస్యాభివృద్ధికై, సర్వదేవతావహన హోమాలు, ఉత్సవాంగ ప్రధాన హోమం, లోక కళ్యాణార్థం రక్షాసు మంత్ర స్మరణం, మహదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణాది కార్యక్రమాలను నిర్వహించారు.
గోదావరి నదిలో మంగళ స్నానాలు
సోమవారం బ్రహ్మోత్సవాల సందర్భంగా
ఉదయాత్వూర్వం నుండి గోదావరిలో స్నానాలను సుదూర ప్రాంతాలకు చెందిన అశేష భక్తులు సాంప్రదాయాచరణలో భాగంగా ఆచరించారు. ధర్మపురి నారసింహుడు మహారాష్ట్ర ప్రాంత వాసులకు కులదైవమైన క్రమంలో సుదూర ప్రాంతాల నుండి ప్రైవేటు వాహనాలలో పరంపరానుగత వంశాచారంలో భాగంగా భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. తెప్పోత్సవ, డోలోత్సవ కార్యక్రమాల అనంతర దర్శనాలకై విచ్చేసిన రాష్ట్రేతర భక్తులు, గోదావరి పౌరోహితులచే సంకల్పాది సత్కర్మలను ఆచరించి, దానధర్మాలు చేసుకున్నారు. నది వద్దే వంటలు చేసుకుని, నదీమ తల్లికి నివేదించి, ఆరగించారు.
మొక్కులు తీర్చుకున్న భక్తులు
సుదూర ప్రాంతాల నుండి వంవపారంపర్య సాంప్రదా యాచరణల ప్రకారం అధిక సంఖ్యలో చేరుకున్న భక్తులు, యాత్రికులు గోదావరినదికి నేరుగా వెళ్ళి, మంగళ స్నానాలు ఆచరించి, సంకల్ప దానధర్మాది సత్కర్మలు ఆచరించి, దైవదర్శనాలకై దేవస్థానం వద్ద ఆలయాల ముందు బారులు తీరి నిలుచున్నారు. యోగానంద, ఉగ్ర నారసిం హునికి ముడుపులు చెల్లించి మెక్కులు తీర్చుకున్నారు. కోరిన కోర్కెల సాఫల్యానికి, దీర్ఘకాలిక వ్యాధుల నయానికి, మానసిక రుగ్మతల నివారణకు భక్తులు బెల్లం, కొబ్బరి కాయలు, వస్త్రాలు, కోడె ముక్కులు, వల్లు బండ, గండా దీపాది మొక్కులు తీర్చుకున్నారు. సంతానార్థం హోమ గుండంవద్ద ప్రత్యేక పూజలు చేయించు కున్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శేషప్ప కళా వేదికపై సంగీత రత్న నరహరి శర్మ ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు
అలరించాయి. ప్రధానంగా శేషప్ప భక్త మండలి ఆధ్వర్యంలో ఎన్నం బాపురెడ్డి నిర్వహణలో సభ్యులు శేషప్ప విరచిత నరసింహ శతక పద్య గానం చేశారు. ట్రస్టు బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, ధర్మ కర్తలు గాయకులను సత్కరించారు.
మధు బాపు బృందం, గొల్లపెల్లి రాంకిషన్ బృందం, భక్తి సంగీత విభావరి,చేగొండ పవన్ కుమార్ బృందం శివ తాండవం, మిమిక్రి పితామహ - గుండి ప్రేమ్ కుమార్, ఓజ్జల పుల్లయ్య శాస్త్రి మిమిక్రీలు, తదితర నృత్య ప్రదర్శనలు, ఆకట్టుకున్నాయి. దేవస్థానం ఈఓ శ్రీనివాస్, కమిటీ చైర్మన్ రవీందర్, సభ్యులు కళాకారులను సన్మానించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం

లైంగిక వేదింపులు కేసులో ఇద్దరికీ 2 నెలల జైలు శిక్ష
.jpeg)
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

ధరణి దరఖాస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు

ధర్మపురి స్వామివారి హోమశాలలో బ్రహ్మోత్సవ హవనాలు

విద్యకు బడ్జెట్ లో15 శాతం నిధులను కేటాయించాలి - ఎబివిపి

మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని కవిత విమర్శ

దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేత
.jpg)
భయం వీడితే విజయం మనదే...

సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవ, కళ్యాణ కరపత్రికను ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత
.jpg)