గొల్లపల్లి మండల కేంద్రంలో గాయత్రి బ్యాంకు ను ప్రారంభించిన చైర్మన్ ముత్యాల లక్ష్మణ్ రెడ్డి

On
గొల్లపల్లి మండల కేంద్రంలో గాయత్రి బ్యాంకు ను ప్రారంభించిన చైర్మన్ ముత్యాల లక్ష్మణ్ రెడ్డి

గొల్లపల్లి ఫిబ్రవరి 21 (ప్రజామంటలు)

గొల్లపెల్లి మండల కేంద్రంలో గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు యొక్క 57 వ శాఖను బ్యాంకు చైర్మన్ శ్రీ ముత్యాల లక్ష్మణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బ్యాంకు చైర్మన్, డైరెక్టర్లు, పురప్రముఖులు, సహకార అధికారులు, ముఖ్యకార్యనిర్వహణాధికారి గార్లు పాల్గొని బ్యాంకు యొక్క వివిధ విభాగాలను ప్రారంభించారు.

అనంతరం జరిగిన సమావేశంలో గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ శ్రీ ముత్యాల లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ 2000 సంవత్సరంలో ప్రారంభించబడిన గాయత్రి బ్యాంకు నిరంతర కృషితో నేడు మల్టీస్టేట్ బ్యాంకుగా రూ॥ 3062.50 కోట్ల వ్యాపారాన్ని సాధించి తెలంగాణలోని కో-ఆపరేటివ్ బ్యాంకులలో అతి పెద్ద బ్యాంకుగా అవతరించి కో-ఆపరేటివ్ వ్యవస్థలో అగ్రగామిగ పనిచేస్తున్నామని అన్నారు. గొల్లపెల్లి ప్రాంత ప్రజలు బ్యాంకు యొక్క సేవలను వినియోగించుకోని బ్యాంకును ఆదరించాలని కోరారు. సహకార వ్యవస్థలో, కార్పోరేట్ బ్యాంకులకు ధీటుగా పనిచేస్తూ, 24 సంవత్సరాల కాలంలోనే 1741.15 కోట్ల డిపాజిట్లతో, 1321.35 కోట్ల ఋణాలను కలిగి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా 56 బ్రాంచీలతో, 7 లక్షల 62 వేల మంది వినియోగదారులను కలిగి అన్ని విధాలుగా మంచి అభివృద్ధిని సాధించామని అన్నారు. బ్యాంకు యందు మొబైల్ బ్యాంకింగ్, ఎఇపిఎస్, యు.పి.ఐ. ఎ.టి.ఎమ్ సర్వీసులు, ఆర్.టి.జి.ఎస్ వంటి టెక్నాలాజికల్ సేవలతో పాటుగా, నిరక్షరాస్యులకు సహాయకంగా ఉండేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్స్ను ఏర్పాటుచేశామని, ఉదయం 10 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తుందని, ఖాతాదారులకు అవసరమైన ఫోటో మరియు జిరాక్స్లను బ్యాంకు యందే ఉచితంగా అందిస్తూన్నామని తెలియజేశారు బ్యాంకు ముఖ్యకార్యనిర్వహణాధికారి వనమాల శ్రీనివాస్ మాట్లాడుతూ బ్యాంకు ముఖ్య ఉద్దేశ్యం సామాన్య మధ్యతరగతి, వర్తక వాణిజ్య వర్గాల ప్రజలకు కార్పోరేట్ బ్యాంకులకు ధీటుగా సేవలందించడమేనని, ఆన్లైన్ సేవలతో పాటుగా ATM, AePS, UPI, RTGS/NEFT వంటి అధునాతన సేవలను అందిస్తున్నామని, గాయత్రి నిర్భయ సేవింగ్ ఖాతా ద్వారా 1 లక్ష రూపాయల ప్రమాదభీమా సౌకర్యాన్ని అందిస్తున్నామని, వర్తక, వ్యాపార, ఉద్యోగులకు కావలసిన అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను సత్వరంగా అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఇట్టి సేవలను గొల్లపల్లి మండల నగర వాసులు వినియోగించుకొని బ్యాంకును ఆదరించాలని కోరారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరాంతానికి మరో 09 బ్రాంచీలను ప్రారంబించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తద్వారా మొత్తం 66 బ్రాంచీలకు చేరుకుంటామని అన్నారు.

అనంతరం బింగి తిరుపతి, AGM మాట్లాడుతూ వినియోగదారులు మాపై చూపిస్తున్న ఎనలేని ఆదరాభిమానాల వల్ల బ్యాంకును మరింత అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తామని, నగరవాసులు మరియు పరిసర గ్రామాల ప్రజలు బ్యాంకు యొక్క సేవలను వినియోగించుకొని బ్యాంకును ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం బ్రాంచి హెడ్ నేరెళ్ళ మునీందర్ మాట్లాడుతూ ఆధార్ నంబరు ద్వారా నగదు బదిలీ పథకం క్రింద వచ్చు సబ్సిడీ బదలాయింపులను, ప్రభుత్వ ఆసరా పెన్షన్లను పొందవచ్చని, బంగారు ఆభరణాలపై ఋణాలను అందజేస్తామని రైతులకు వ్యాపారులకు ఆస్థి తనఖాపై ఋణ సౌకర్యం కల్పిస్తామని, వినియోగదారులు బ్యాంకును ఆదరించి ప్రోత్సహించాలని కోరారు.

బ్యాంకు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పుర: ప్రముఖులు, వ్యాపారులు, సహకార అధికారులు, బ్యాంకు పాలక వర్గ సభ్యులైన ఎమ్. సౌజన్య, ఎ. రాజిరెడ్డి, ఎ.సత్యం, వై. అశోక్, కె. శ్రీనాథ్, బి. విజయ్, జి.గంగాధర్, వి. మాధవి, ఆర్. సతీష్, ఎస్. రవి కుమార్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

గొల్లపల్లి మండల ప్రాథమిక ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ  చేసినకలెక్టర్ బి.సత్య ప్రసాద్ 

గొల్లపల్లి మండల ప్రాథమిక ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ  చేసినకలెక్టర్ బి.సత్య ప్రసాద్  గొల్లపల్లి మార్చి 18 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండల కేంద్రంలో మంగళ వారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ని  కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఓపీ సేవలు, ఐపీ సేవలు రికార్డ్స్ ల్యాబ్ రికార్డ్స్ ఐపీ రికార్డ్స్ మెడికల్ ఫార్మసి కలెక్టర్ పరిశీలించారు.  ఆసుపత్రిలో వైద్య సేవలను గురించి నేరుగా పేషంట్లని వివరాలు అడిగిఆర్యోగ...
Read More...
Local News 

చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించేలా చర్యలు చేపట్టాలి

చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించేలా చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్. గొల్లపల్లి మార్చి 18 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని లోత్తునూరు  మరియు వెల్గటూర్ మండలం కుమ్మరపల్లి గ్రామంలో D-64, D-53, డిస్ట్రిబ్యూటరీ టైలింగ్ కెనాలను  సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కెనాల్ ఆవరణలోని ఉన్న పిచ్చి మొక్కలను పూర్తిస్థాయిలో తొలగించాలని దాని...
Read More...
Local News 

బీసీ రిజర్వేషన్ బిల్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంబరాలు

బీసీ రిజర్వేషన్ బిల్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంబరాలు జగిత్యాల మార్చి 18 (ప్రజా మంటలు)శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టి, ఆమోదం పొందిన సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  ఆదేశాల మేరకు జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో   సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి, స్వీట్ల ను పంపిణీ...
Read More...
Local News 

పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం

పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం భూపాలపల్లి మార్చి 18 (ప్రజామంటలు)  : భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని జెడ్పిహెచ్ఎస్ పెద్దతుండ్ల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి సభాధ్యక్షత వహించిన ప్రధానోపాధ్యాయులు బి తిరుపతి మాట్లాడుతూ, భవిష్యత్తులో క్రమశిక్షణ కలిగిన విద్యార్థులుగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు .ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన...
Read More...
Local News 

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం హనుమకొండ మార్చ్ 18 (ప్రజామంటలు) : కాకతీయ యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద మంగళవారం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్...
Read More...
Local News 

బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో  జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం 

బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో  జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం  జిల్లా ప్రధానకార్యదర్శి రాగిల్ల సత్యనారాయణ  గొల్లపల్లి  (జగిత్యాల)మార్చి 17 (ప్రజా మంటలు) నర్సింగాపూర్ గ్రామం 437, 251 సర్వే నంబరులో వందల కొద్ది ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమంగా ధరణి పట్టాలు సృష్టించుకున్న వాటిని రద్దు చేయాలని బిజెపి నాయకులు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నాయకులు మాట్లాడుతూ నర్సింగాపూర్లో ప్రభుత్వ భూమిని కబ్జా...
Read More...
Local News  State News 

లైంగిక వేదింపులు కేసులో ఇద్దరికీ 2 నెలల జైలు శిక్ష

లైంగిక వేదింపులు కేసులో ఇద్దరికీ 2 నెలల జైలు శిక్ష మెట్ పల్లి మార్చ్ 17 :  మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగికంగా వేధించిన కేసులో మెట్ పల్లి కోర్టు, ఇద్దరు నిందితులకు 2 నెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికి పదివేల రూపాయలు జరిమానా విధించింది  మెట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన పీట్ల సూరి (21)  కొమిరి నరేష్ (20 )...
Read More...
Local News 

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి  జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.    జగిత్యాల మార్చి 17(ప్రజా మంటలు) ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించి వెంటవెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్ బి.ఎస్.లత తో...
Read More...
Local News 

ధరణి దరఖాస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

ధరణి దరఖాస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ .జగిత్యాల మార్చి 17(ప్రజా మంటలు)  సోమవారం రోజున జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీవోలు,తహసిల్దార్లు,అదనపు కలెక్టర్ బి.ఎస్ లత తో కలసి సమీక్ష నిర్వహించారు.ఆయా మండల వారిగా ధరణి దరఖాస్తులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్లో వున్న అన్ని దరఖాస్తు ఈ నెల చివరి వరకు పూర్తి...
Read More...
Local News 

మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు

మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు *  కాంగ్రెస్ అంటే మహిళలని మోసం చేయడమే...        *  బీజేపీ నాయకురాలు ఎం. రాజేశ్వరి... సికింద్రాబాద్​ మార్చి 17 (ప్రజామంటలు):   వరంగల్ లో జరిగిన బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడిన మాటలు అన్ని తప్పుల తడక అని కాంగ్రెస్ అంటే మహిళాభివృద్ధి కాదని మహిళలను మోసం చేయడమే కాంగ్రెస్ విధానం అని ముఖ్యమంత్రి...
Read More...
Local News  State News 

ధర్మపురి స్వామివారి హోమశాలలో బ్రహ్మోత్సవ హవనాలు

 ధర్మపురి స్వామివారి హోమశాలలో బ్రహ్మోత్సవ హవనాలు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు (రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494) ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ (ఉగ్ర, యోగానంద), శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాల సందర్భంగా, దేవస్థానం లోని ప్రధానాలయాలలో సోమ వారం విధివిదాన  సాంప్రదాయ ప్రత్యేక పూజలొ నరించారు. దేవస్థాన యజ్ఞా చార్యులు కందాల పురుషోత్తమాచార్య, ఆస్థాన వేదపండితులు రమేశ శర్మ, ఆలయాల...
Read More...
Local News 

విద్యకు బడ్జెట్​ లో15 శాతం నిధులను కేటాయించాలి - ఎబివిపి

విద్యకు బడ్జెట్​ లో15 శాతం నిధులను కేటాయించాలి - ఎబివిపి *  సికింద్రాబాద్​ పీజీ కాలేజీ వద్ద ఏబీవీపీ ధర్నా  * ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం సికింద్రాబాద్​ మార్చి 17 (ప్రజామంటలు): నేడు ప్రవేశపెట్టబోయే రాష్ర్ట బడ్జెట్ లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ 15 శాతం నిధులను కేటాయించాలని, తక్షణమే విద్యామంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం సికింద్రాబాద్​ పీజీ కాలేజీ వద్ద...
Read More...