విద్యకు బడ్జెట్ లో15 శాతం నిధులను కేటాయించాలి - ఎబివిపి
* సికింద్రాబాద్ పీజీ కాలేజీ వద్ద ఏబీవీపీ ధర్నా
* ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
సికింద్రాబాద్ మార్చి 17 (ప్రజామంటలు):
నేడు ప్రవేశపెట్టబోయే రాష్ర్ట బడ్జెట్ లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ 15 శాతం నిధులను కేటాయించాలని, తక్షణమే విద్యామంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం సికింద్రాబాద్ పీజీ కాలేజీ వద్ద ధర్నా నిర్వహించారు. కాలేజీ ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్బంగా కూకల్ పల్లి విభాగ్ కన్వీనర్ శ్రీనాథ్, సికింద్రాబాద్ జిల్లా ఏబీవీపీ కన్వీనర్ చెర్క బాలు లు మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల కోట్ల స్కాలర్ షిప్ , పీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ పీజీ కాలేజీలో విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని, నూతన బిల్డింగ్స్ నిర్మించాలని కోరారు. విద్యార్థుల హక్కులను కాలరాస్తూ ఓయూ వీసీ తీసుకువచ్చిన సర్క్యూలర్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ నాయకులు పాండురంగా, అభి,జ్యోత్య్న, శివాని, పవన్, కృష్ణ,శ్రీకాంత్, రవి,రాజు, అభిలాష్, ప్రసాద్, పరమేశ్, అలిఫియా, అంకిత, ప్రణిత పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం

లైంగిక వేదింపులు కేసులో ఇద్దరికీ 2 నెలల జైలు శిక్ష
.jpeg)
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

ధరణి దరఖాస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు

ధర్మపురి స్వామివారి హోమశాలలో బ్రహ్మోత్సవ హవనాలు

విద్యకు బడ్జెట్ లో15 శాతం నిధులను కేటాయించాలి - ఎబివిపి

మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని కవిత విమర్శ

దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేత
.jpg)
భయం వీడితే విజయం మనదే...

సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవ, కళ్యాణ కరపత్రికను ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత
.jpg)