సూపర్ పోలీస్.వేములవాడలో బాలిక కిడ్నాప్ ను చేధించిన రాజన్న సిరిసిల్ల పోలీసులు
సూపర్ పోలీస్.వేములవాడలో బాలిక కిడ్నాప్ ను చేధించిన రాజన్న సిరిసిల్ల పోలీసులు
రాజన్న సిరిసిల్ల జనవరి 08:
వేములవాడలో బాలిక కిడ్నాప్ ను రాజన్న సిరిసిల్ల పోలీసులు వేగంగా చేధించారు..
ఎస్పీ అఖిల్ మహాజన్ వ్యూహంతో ఫలించిన పోలీసులు స్పెషల్ ఆపరేషన్.
గత 10 రోజులుగా శ్రమించి పాప ఆచూకీ పోలీసులు.కనుగొన్నారు.జిల్లాలో సంచలనంగా మారిన అధ్విత మిస్సింగ్ కేసును శోధించి ఛేదించిన జిల్లా పోలీసులు.
పాప మిస్సింగ్ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చి డిసెంబర్ 23న ఆలయ ప్రాంగణంలో తప్పిపోయిన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మం. చింతలపల్లి గ్రామానికి చెందిన సింగారపు అద్విత (4) ఆచూకీ లభ్యం..
మహబూబాబాద్ జిల్లాలోని ఓ ప్రాంతంలో పోలీసులు పాపను గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం..
దీనికి సంబంధించిన పూర్తి వివరాలపై రేపు మీడియా సమావేశంలో వెల్లడించనున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు..
పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాలిక మిస్సింగ్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది..
దీంతో జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక బృందాలతో గత పది రోజులుగా పాపను గుర్తించే పనిలో పడ్డారు..
నిరీక్షణ తర్వాత పాపను మహబూబాబాద్ లో గుర్తించినట్లు తెలిసింది దీంతో పోలీసుల శ్రమ ఫలించినట్లయింది.