3 ,4 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్, మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జనవరి 6( ప్రజా మంటలు ) :
పట్టణములోని 3వ వార్డు లో 20 లక్షల నిధులతో,4వ వార్డు నాగేంద్ర నగర్ లో 20 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్.
ఎమ్మెల్యే మాట్లాడుతూ....
- జగిత్యాల పట్టణం లో 1 కోటి 50 లక్షలతో పనులు జరుగుతున్నాయి.
- ప్రతి వార్డు లో దాదాపు 100 మంది నిరుపేదలకు డబల్ బెడ్రూం ఇండ్లు మంజూరు.
- 36 కోట్ల నిధులతో పట్టణ ప్రజలకు మంచి నీటి సరఫరా కు పనులు జరుగుతున్నాయి.
- స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా STP లకు కండ్ల పల్లి, మోతే చెరువులకు 5 కోట్ల 80 లక్షలు నిదులు మంజూరు.
- పట్టణ అభివృద్ధి ద్యేయంగా పనిచేస్తానన్నారు.
- ప్రజల మద్దతు తోనే గెలుపు సాధ్యం..
- రాజకీయాలు ఎన్నికల వరకే అభివృద్ధి నిరంతర ప్రక్రియ అన్నారు.
- జగిత్యాల యవర్ రోడ్డు నుండి తిప్పన్న పెట్ అనంతారం వరకు బ్లాక్ స్పాట్ రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తా అన్నారు.
- జగిత్యాల పట్టణం పరిసర ప్రాంతాల్లో కేంద్రీయ విద్యాలయం,ఏకలవ్య పాఠశాల,కస్తూర్బా పాఠశాల మంజూరు కానున్నాయి ఎంపి అరవింద్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.
- నాళాలను ఆక్రమించడం వల్ల వరద నీరు ఇండ్ల కు చేరి ప్రజలకు ఇబ్బందిగా మారిందని అన్నారు.
- ప్రజలు పట్టణ అభివృద్ధి కి ప్రజల సహకారం అవసరం అన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,కమిషనర్ చిరంజీవి,స్థానిక కౌన్సిలర్లు క్యాదసు నవీన్,చదువుల తిరుపతమ్మ కోటేశ్,నారాయణ రెడ్డి,పంబల రాంకుమార్,నాయకులు క్యాదాసు నాగయ్య,గుమ్మడిసత్యం,దయల శంకర్,చేట్పల్లి సుధాకర్,కోలగానిసత్యం, రామకృష్ణరెడ్డి,మతీన్,ఖలేం,మనోహర్ రావు,ఈశ్వర్, రాచర్ల విజయ్,ఆరిప్,శరత్ రావు,రంగుమహేష్,గుమ్ములా అంజయ్య,శ్రీరామ్ భిక్షపతి,ప్రసాద్ గౌడ్,కూతురుశేఖర్,రాం ప్రసాద్,ప్రభాకరరావు,వంశి బాబు,ఏనుగుల రాజు,గంగాధర్,AE అనిల్,కౌన్సిలర్లు,వార్డునాయకులు,మహిళలు, మున్సిపల్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.