జగిత్యాలలో  నేరాల తీరుపై వార్షిక నివేదికను వెల్లడించిన  జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్‌..

On
జగిత్యాలలో  నేరాల తీరుపై వార్షిక నివేదికను వెల్లడించిన  జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్‌..

జగిత్యాలలో  నేరాల తీరుపై వార్షిక నివేదికను వెల్లడించిన 
జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్‌..
గతేడాదికంటే  పెరిగిన కేసుల సంఖ్య - అదుపులో శాంతి భద్రతలు

జగిత్యాల డిసెంబర్ 26:
జగిత్యాల జిల్లాలో గతంకంటే కేసుల సంఖ్య పెరిగినప్పటికీ శాంతిభద్రత విషయంలో భాగానే ఉందని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు.. జిల్లాలో 2023లో 4 వేల 999 కేసులు నమోదైతే.. ఈ ఏడాది 5 వేల 9వందల 19 కేసులు నమోదయ్యాయని అన్నారు... అత్యధికంగా జగిత్యాల టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో 791 కేసులు నమోదవుతే.. అతి తక్కువగా బీర్‌పూర్‌ స్టేషన్‌లో 120 కేసులు నమోదైనట్లు వెల్లడించారు.. హత్య కేసులు 28,  హత్యాచారా కేసులు గతం కంటే తగ్గాయని ఈ ఏడాది 40 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.. రోడ్డు ప్రమాదాలు గతేడాదికంటే తగ్గాయని ఈ ఏడాది 451 కేసులు నమోదైనట్లు తెలిపారు.. అయితే రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారు గతేడాదికంటే 29 మంది ఎక్కువగా మృతి చెందారని అన్నారు.. ప్రజల రక్షణ కోసం పోలీసులు పని చేస్తున్నారని అన్నారు.

Tags