మల్లన్నపేట జాతరలో తప్పిపోయిన బాబును కుటుంబ సభ్యులకు అప్పగించిన ఎస్ఐ, సతీష్
On
మల్లన్నపేట జాతరలో తప్పిపోయిన బాబును కుటుంబ సభ్యులకు అప్పగించిన ఎస్ఐ సతీష్
గొల్లపల్లి డిసెంబర్ 25 (ప్రజా మంటలు):
మల్లన్నపేటలో జరుగుతున్న దొంగమల్లన్న జాతరలో బుధవారం భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో తప్పిపోయిన జగిత్యాల కు చెందిన 5 సంవత్సరాల బాబు గుర్రం సాయి కృతిక్ తల్లిదండ్రులకు గొల్లపల్లి పోలీసులు అప్పగించారు.
ఈ సందర్భంగా బాబు తల్లిదండ్రులు గొల్లపల్లి ఎస్ఐ చిర్ర సతీష్, హెడ్ కానిస్టేబుల్ ఎల్లయ్య, కానిస్టేబుల్స్ వేణు, తిరుపతి , పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు..
Tags