స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

On
స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

సికింద్రాబాద్ డిసెంబర్ 25:

స్కై ఫౌండేషన్ కార్యాలయంలో క్రిస్మస్ కేకును కట్ చేసి, రోడ్ల పక్కన జీవనం సాగిస్తున్న సంచార జాతులు, నిరాశ్రయుల కుటుంబాల చిన్నారులకు బహుమతులు, వివిధ రకాల తినుబండారాలు, ఆటవస్తువులను అందించి క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశాము. ఆటవస్తువులు, బహుమతులు, వివిధరకాల తినుబండారాలను చూసి ఆ చిన్నారుల ఆనందానికి హద్దే లేనంతగా ఉత్సహాన్ని పొందడం చూసిన వారి తల్లిదండ్రులు మా పిల్లలలో చాల ఆనందాన్ని  నింపారని స్కై ఫౌండేషన్ కు కృతఙ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ డాక్టర్. వై. సంజీవ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఓ.పావని, సేవ సభ్యులు నేహా అఫ్సారి, ఇఫ్రాన్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Tags