దారిని మూసేస్తూ...అక్రమ నిర్మాణం... * భోలక్ పూర్ లో ఇల్లీగల్ నిర్మాణం
దారిని మూసేస్తూ...అక్రమ నిర్మాణం...
* భోలక్ పూర్ లో ఇల్లీగల్ నిర్మాణం
* బేగంపేట డిప్యూటీ కమిషనర్ కు స్థానికుల ఫిర్యాదు
సికింద్రాబాద్ డిసెంబర్ 24, (ప్రజా మంటలు)::
సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపమో....కొందరి అత్యాశ ఫలితమో గాని అక్రమ నిర్మాణాలు రోజు, రోజుకి పెరుగుతున్నాయి. చిన్న గల్లీలో అందరు కామన్ గా వినియోగించే రహదారినే మూసేవిదంగా ఓ వ్యక్తి అక్రమ నిర్మాణం చేస్తూ స్లాబ్ వేయడం వెలుగు చూసింది. దీనికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. సనత్ నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్ పేట డివిజన్ భోలక్ పూర్ లో ఇంటినెంబర్ 6–4–199 నెంబర్ గల ఇల్లును పూర్తి అక్రమంగా, ఇల్లీగల్ గా నిర్మిస్తున్నారని పలువురు జీహెచ్ఎమ్సీ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదుచేశారు. అసలే చిన్న గల్లీ లోని దారిపైన స్లాబ్ వేయడం గురించి అధికారలు వెంటనే విచారణ జరిపి , అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై పలువురు బేగంపేట జీహెచ్ఎమ్సీ సర్కిల్ నెంబర్30 డిప్యూటీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. సంబందిత అధికారులు వెంటనే రంగంలోకి దిగి, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.