టీడీఎఫ్ ఆధ్వర్యంలో రైతు దినోత్సవం
టీడీఎఫ్ ఆధ్వర్యంలో రైతు దినోత్సవం
సికింద్రాబాద్ డిసెంబర్ 23 (ప్రజా మంటలు):
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా పెద్ద మాసంపల్లి రైతు వేదికలో జాతీయ రైతు దినోత్సవం వేడుకలను నిర్వహించారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా రైతులకు సేంద్రీయ వ్యవసాయం పై అవగాహన కల్పించారు. రైతులు మోతాదుకు మించి రసాయనిక ఎరువులు మరియు పురుగుల మందు వాడడం వలన నేల, వాయువు అన్ని కాలుష్యం అవుతున్నాయని అన్నారు. రైతులు రసాయనిక ఎరువులపై ఆధారపడడం వలన రైతులకు రోజు రోజుకి పెట్టుబడి ఖర్చు పెరుగుతుందని, దీనిని అధిగమించడానికి రైతులు సుస్థిర వ్యవసాయం వైపు అడుగులు వేయాలి అని కోరారు. అధికారుల సలహాలు సూచన మేరకు ఎరువులు వాడాలి ,వరి కోయాలను తగలబెట్టకుండా వేస్ట్ డీకంపోజర్ వినియోగించాలి అదేవిధంగా కీటకాలను నియంత్రించడానికి జిగురు అట్టలు వాడాలని సూచించారు .
ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు వేస్ట్ డీకంపోజర్ మరియు జిగురు అట్టలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున మరియు రైతులు పాల్గొన్నారు.