బౌద్దనగర్ సీవరేజ్ పనుల్ని పరిశీలించిన కార్పొరేటర్
On
బౌద్దనగర్ సీవరేజ్ పనుల్ని పరిశీలించిన కార్పొరేటర్
సికింద్రాబాద్ డిసెంబర్ 12 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధ నగర్ డివిజన్ రోడ్ నెంబర్ 6 లో నూతనంగా నిర్మిస్తున్న సీవరేజి లైన్ పనులను కార్పొరేటర్ కంది శైలజ గురువారం పరిశీలించారు. రూ.7 లక్షల నిధులతో నిర్మిస్తున్న కొత్త సీవరేజీ లైన్ తో స్థానికుల ఇబ్బందులు తొలుగుతాయని అన్నారు. పనులు నాణ్యతగా, తొందరగా చేయాలని ఆమె సంబంధిత కాంట్రాక్టర్ కు సూచించారు. ఆమె వెంట స్థానిక నాయకులు, కాలనీ ప్రతినిధులు ఉన్నారు.
Tags