రాంగోపాల్ వర్మ కు హైకోర్టు లో ఊరట ముందస్తు బెయిల్ మంజూరు
రాంగోపాల్ వర్మ కు హైకోర్టు లో ఊరట ముందస్తు బెయిల్ మంజూరు
విజయవాడ డిసెంబర్ 10:
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు ముందస్తు బెయిల్ లభించింది.రామ్గోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు.
సోషల్ మీడియా పోస్టింగ్ కేసులో ముందస్తు బెయిల్
సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్పా అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అలాగే దర్యాప్తుకు సహకరించాలని రామ్ గోపాల్ వర్మకు న్యాయస్థానం ఆదేశించింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని వర్మకు హైకోర్ట్ స్పష్టం చేసింది. కాగా.. వర్మ రూపొందించిన 'వ్యూహం' సినిమా ప్రమోషన్లో భాగంగా అప్పటి ప్రతిపక్ష నాయకులు లోకేశ్, బ్రాహ్మణి, పవన్ కల్యాణ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వ్యవహారంపై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై ఫిర్యాదు నమోదైంది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్ లో పోస్టు చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పీఎస్లో ఫిర్యాదు చేశారు.