మూసి సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను తొలగించడం సరికాదు.- భారత సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ సిఎస్ రాజు..

On
మూసి సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను తొలగించడం సరికాదు.- భారత సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ సిఎస్ రాజు..

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల నవంబర్ 17 (ప్రజా మంటలు) : 

మూసినది సుందరీ కరణ పేరుతో ప్రభుత్వం పేదల ఇళ్ళను తొలగించడం సరికాదని భారత సురక్ష సమితి నాయకులు అన్నారు.

జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ సిఎస్ రాజు మాట్లాడుతూ.... కాంగ్రెస్ ప్రభుత్వం మూసి ప్రక్షాళన, సుందరీకరణ పేరుతో నిరుపేదల ఇళ్లను కూలగొట్టి వాళ్లకు నిలువ నీడ లేకుండా చేసి రాక్షసానందం పొందుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలకు జీవితకాలం కల అయిన సొంత ఇంటిని కూల్చివేసి వారిని రోడ్లపాలు చేయడం సరికాదని అన్నారు. బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి మూసీ నది బాధితులకు న్యాయం జరగాలని కోరుతూ మూసీ నది వద్ద బస చేయడమే కాకుండా వారికి భరోసా కల్పించడం శుభ పరిణామం అని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా బాధితులకు తగిన న్యాయం చేసిన తర్వాతనే మూసి ప్రక్షాళన చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పుప్పాల సత్యనారాయన, వేముల పోచమల్లూ, నరేందులా శ్రీనివాస్, ఎడమల వెంకట్ రెడ్డి, బండారి మల్లికార్జున్, రాజేశ్వర్ రావు, బాషెట్టి దుబ్బరజం, ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Tags