వైభవంగా ఆలయ నిర్మాణానికి శంఖుస్థాపన.

భక్తుల భాగస్వామ్యంతో నవదుర్గా పీఠ క్షేత్రం నిర్మాణం - భక్త జన సంద్రం పీఠ క్షేత్రం పరిసర ప్రాంతం

On
వైభవంగా ఆలయ నిర్మాణానికి శంఖుస్థాపన.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల నవంబర్ 17 (ప్రజా మంటలు) : 

పట్టణంలోని నవదుర్గా పీఠ క్షేత్రంలో వైభవంగా నూతన ఆలయ నిర్మాణానికి కార్యక్రమం అంగరగవైభవంగా శ్రీమాన్ నంబి వేణుగోపాల చార్య కౌశిక ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు చేసి శంఖుస్థాపన నిర్వహించారు. 

శనివారం రాత్రి 9:32 నిం. లకు గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవచనం, నవగ్రహ మండప పూజ ,ప్రధాన కలశ పూజ ప్రారంభించారు. ఆలయ నిర్మాణం ఆదివారం ఉదయం 8:40 శంఖుస్థాపన చేశారు. ఆలయ పరిసరాల్లో భక్తులు, మహిళల అమ్మవారి నామస్మరణతో క్షేత్రం భక్త జన సంద్రంతో మార్మోగింది.

జిల్లా కేంద్రంలో నవదుర్గా సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో గోవిందుపల్లిలో గత 29 ఏళ్లతరబడి కళ గా ఉన్న ఆలయ నిర్మాణం నేడు ఆలయ నిర్మాణం చేపట్టాలనే సత్సంకల్పంతో భక్తులు భాగస్వామ్యంతో అమ్మవారి ఆలయ నిర్మాణానికి భక్తులు, దాతల సహకారంతో చేపట్టేదుకు ముందుకు వచ్చామన్నారు.

అమ్మవారి ఆలయాన్ని కృష్ణశిలలతో నవదుర్గా పీఠ క్షేత్రం శతాబ్దాల పాటు మన్నిక ఉండేలా తరతరాలుగా నిలిచిపోయే పీఠ క్షేత్ర నిర్మాణం చేపడుతున్నట్లు నవదుర్గా సేవా సమితి ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. 

అమ్మవారి ఆలయ అభివృద్ధిలో భక్తులు, దాతలు భాగస్వామ్యం కావాలనే సంకల్పంతో స్వయంగా శంఖుస్థాపన కార్యక్రమంలో ముత్యం, పగడం, రాగి నాణెం వేసేందుకు తొలి అడుగు వేయించారు. 

జిల్లా కేంద్రంలో అమ్మవారి ఆలయ నిర్మాణం ఎన్నో యేండ్ల కళ భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుబోతుందని నవదుర్గా పీఠ క్షేత్రం అద్భుతమైన దివ్య క్షేత్రంగా అభివృద్ధి చేయడానికి తొలి అడుగు పడనుందని శ్రీమాన్ నంబి వేణుగోపాల చార్య కౌశిక అన్నారు.

నవదుర్గా పీఠ క్షేత్రం ఆలయ నిర్మాణ అభివృద్ధిలో భక్తులు , ప్రజలు భాగస్వామ్యం కావాలని మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. 

ఆదివారం జిల్లా కేంద్రంలో నవదుర్గా పీఠ క్షేత్రం గోవిందు పల్లి అమ్మవారి ఆలయ నిర్మాణంలో ముత్యం, పగడం, రాగి నాణెం వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఆదివారం జిల్లా కేంద్రంలో నవదుర్గా పీఠ క్షేత్రం గోవిందు పల్లి అమ్మవారి ఆలయ నిర్మాణంలో ముత్యం, పగడం, రాగి నాణెం వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా తాజా మాజీ జిల్లా జెడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ మాట్లాడుతూ.. భక్తుల ఆధ్యాత్మిక శోభ విరాజల్లుతున్నా అమ్మవారి ఆలయ శంకుస్థాపన చేయడం అభినందనీయమని హర్షం వ్యక్తంచేశారు. పీఠ క్షేత్రంలో అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.  

ఈకార్యక్రమంలో తిగుల్ల విశుశర్మ , మృత్యుంజయం, సాంబయ్య శ్రీమాన్ నంబి వాసుదేవ చార్య కౌశిక, భారత్, భక్తులు, నవదుర్గా సేవా సమితి ట్రస్ట్ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం కౌన్సిలర్ కోలగాని సత్యం ప్రేమలత, తదితులున్నారు.

Tags