సర్వే సిబ్బందికి పారితోషకం ప్రకటించాలి. - స్టేట్ టీచర్స్ యూనియన్

On
సర్వే సిబ్బందికి పారితోషకం ప్రకటించాలి. - స్టేట్ టీచర్స్ యూనియన్

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల నవంబర్ 17 (ప్రజా మంటలు) : 

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుండి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ కులగణన సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్లకు, సుపర్వైజర్స్ , సిబ్బందికి ఇచ్చే పారితోషకం పై వెంటనే జీవో రూపంలో స్పష్టత నివ్వాలని స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మచ్చ శంకర్,బైరం హరికిరణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఆదివారం విద్యానగర్ లోని ఎస్టియు భవన్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో బోధనేతర పనులకు వినియోగించిన ఉపాధ్యాయులకు, ఇతర సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ పై ముందస్తుగా ప్రభుత్వ ఉత్తర్వుల రూపంలో ఆదేశాలు జారీ చేసేవారన్నారు.

ఈ సర్వే లో ఎన్యుమరెటర్ లను తక్కువగా నియమించి ఇండ్ల గణన ఎక్కువగా కేటాయించడం వల్ల సర్వే చేసే సిబ్బంది తీవ్రమైన ఒత్తిడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రని అన్నారు..

సెలవు రోజుల్లో సర్వే చేసిన సిబ్బందికి ప్రత్యేక సెలవులు ( సి సి ఎల్స్) మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్నారు.

అలాగే చెల్లించే మొత్తం పారితోషకం శాస్త్రీయంగా గౌరవప్రదంగా ఉండాలన్నారు. సర్వే పూర్తయిన చివరి రోజునే వెంటనే రెమ్యునరేషన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. గడువు పొడిగించే ఒత్తిడి దూరం చేయాలన్నారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఎన్నో బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేశారు.

రాష్ట్ర కార్యదర్శి రవీందర్ జిల్లా ఆర్థిక కార్యదర్శి బండి శ్రీనివాస్ జిల్లా బాధ్యులు మేకల ప్రవీణ్ , నరేష్, మురళి, దశరథ్ రెడ్డి, కృష్ణ, వెంకటేష్ తదితరులు ఉన్నారు.

Tags