హే రామ్ ! గాంధీ విగ్రహానికి వైకల్యం! దీనికి ఎవరు బాధ్యులు?
మంచినీళ్ళు బావి దగ్గరి గాంధీ విగ్రహాన్ని పట్టించుకునేది ఎవరు?
హే రామ్ ! గాంధీ విగ్రహానికి వైకల్యం!
దీనికి ఎవరు బాధ్యులు?
మంచి నీళ్ళు బావి దగ్గరి గాంధీ విగ్రహాన్ని పట్టించుకునేది ఎవరు?
జగిత్యాల నవంబర్ 17 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ రోడ్డు మంచినీళ్ల భావి వద్ద గల గాంధీ విగ్రహానికి వైకల్యం చోటుచేసుకుంది. గతంలో కొన్ని రోజులుగా గాంధీ విగ్రహం కుడి చేతిలో ఉండాల్సిన చేతి కర్ర విరిగి చిన్న ముక్క మాత్రమే ఉండిపోయింది.
గాంధీ జయంతి రోజు నాడు ప్రజాప్రతినిధులు చేతి కర్ర లేని గాంధీ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కానీ కనీసం గాంధీ విగ్రహం చేతిలో ఉండాల్సిన కర్రను సైతం ఉంచాలనే ఆలోచన అధికారులకు రాకపోవడం శోచినీయం.
కాగా ఇటీవల విగ్రహానికి ఎడమ చేయి విరిగి ఉన్నప్పటికీ దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు . విగ్రహాలు ఏర్పాటు చేయడంలో ప్రజాప్రతినిధులు పోటీలు పడుతుంటారు. అదేవిధంగా జయంతి, వర్ధంతులను ఘనంగా ఏర్పాటు చేయడంలో చూపిన చొరవ కనీసం విగ్రహాలకు ఉండాల్సిన ఆహార్యం ,కళ్ళజోడు, చేతి కర్ర లేనప్పుడు సిద్ధాంతాలు వల్లించే ప్రజాప్రతినిధులైన వారెవరూ పట్టించుకోవడం లేదు.
బాధ్యతాయుతమైన అధికారులైన కనీసం గాంధీ విగ్రహం కోల్పోయిన ఆహార్యం తిరిగి ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.