జర్నలిస్ట్ ల హక్కులు, భద్రత కోసం వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా కుటుంబంలో చేరండి
On
జర్నలిస్ట్ ల హక్కులు, భద్రత కోసం వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా కుటుంబంలో చేరండి
......కరీంనగర్ జిల్లా నాయకులు తాడూరి కరుణాకర్
కోరుట్ల సెప్టెంబర్ 27:-
భారతదేశంలో జర్నలిస్టుల హక్కుల సంక్షేమానికి పాటుపడే గుర్తింపు పొందిన వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం పొందడం జర్నలిస్టుల హక్కుగా భావించాలని కరీంనగర్ జిల్లా నాయకులు తాడూరి కరుణాకర్, శివనాద్రి ప్రమోద్ కుమార్ లు పిలుపునిచ్చారు.
కోరుట్ల పట్టణంలో ఐ బి అతిథి గృహంలో నిర్వహించిన సమావేశంలో వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న వారు, భారత దేశంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ ద్వారా జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన సంఘమే వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా అని తాడూరి కరుణాకర్, శివనాద్రి ప్రమోద్ కుమార్ స్పష్టం చేశారు.
వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా సభ్యత్వ నమోదులో కోరుట్ల పాత్రికేయులు ఆకుల మల్లికార్జున్, మన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉరుమడ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 60 మంది పాత్రికేయులు వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా సభ్యత్వం స్వీకరించారని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా నాయకులు బలిజ రాజారెడ్డి, కోరుట్ల ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఆకుల మల్లికార్జున్, మన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉరుమడ్ల శ్రీనివాస్, వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా నూతనంగా సభ్యత్వం పొందిన పాత్రికేయులు పాల్గొన్నారు.
Tags