ఇండ్ల స్థలాల కోసం ఎన్నాళ్ళు పడిగాపులు - అర్ధ నగ్న నిరసన ప్రదర్శన. 

On
 ఇండ్ల స్థలాల కోసం ఎన్నాళ్ళు పడిగాపులు - అర్ధ నగ్న నిరసన ప్రదర్శన. 

మా కాళ్లు అరిగిన కరుణించరా ప్రజాప్రతినిధులారా?
 ఇండ్ల స్థలాల కోసం ఎన్నాళ్ళు పడిగాపులు
మా తెల్ల బట్టల వెనుక దుర్భర పరిస్థితులు ఎవరికి తెలుసు
జిల్లా అధ్యక్షుడు చీటీ శ్రీనివాసరావు
జర్నలిస్టుల అర్ధ నగ్న నిరసన ప్రదర్శన. 
 
జగిత్యాల ఆగష్టు 13 (ప్రజా మంటలు) :
జిల్లా కేంద్రంలో ఇళ్ల స్థలాల సాధన కోసం జర్నలిస్టులు మంగళవారం అర్ధ నగ్న ప్రదర్శన చేశారు. ఇళ్ల స్థలాల సాధన కోసం గత 15 రోజులుగా వివిధ రూపాలలో నిరసన ప్రదర్శన చేసిన జర్నలిస్టులు గత 11 రోజులుగా నిరవధిక నిరసన దీక్షలు చేపట్టారు. అందులో భాగంగా ఆర్డీవో కార్యాలయం ఎదుట గల దీక్ష శిబిరం నుండి అర్ధ నగ్నంగా పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు చీటీ శ్రీనివాసరావు మాట్లాడుతూ జర్నలిస్టులకు న్యాయపరంగా దక్కాల్సిన ఇళ్ల స్థలాల కోసం గత 30 సంవత్సరాలుగా పడిగాపులు కాసే పరిస్థితిని ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు తీసుకువచ్చారన్నారు. జర్నలిస్టుల తెల్ల బట్టల వెనుక ఎలాంటి దుర్భర పరిస్థితులు ఉంటాయో ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు గమనించాలన్నారు. మూడు దశాబ్దాలుగా తమ హక్కుల కోసం కాళ్లు అరిగేలా తిరిగిన ఫలితం లేకపోవడంతో విధిలేని పరిస్థితిలో జర్నలిస్టులు ఆందోళన బాట పట్టడం జరిగిందన్నారు. వృత్తిపరంగా సమాజంలో గౌరవప్రదంగా ఉండే జర్నలిస్టులు అర్థనగ్న ప్రదర్శన చేయాల్సిన పరిస్థితిని తీసుకువచ్చిన ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చిందని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తమ న్యాయమైన సమస్యను పరిష్కరించాలని కోరారు.