ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర సాహితీవేత్తలకు...సినారే సాహిత్య పురస్కారాలు ప్రదానం

On
ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర సాహితీవేత్తలకు...సినారే సాహిత్య పురస్కారాలు ప్రదానం

ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర సాహితీవేత్తలకు...సినారే సాహిత్య పురస్కారాలు ప్రదానం చేసిన డాక్టర్ జీ చిన్నారెడ్డి, నందిని సిధారెడ్డి, జలంధర్ రెడ్డి 

సినారే సాహిత్య సేవ అజరామరం, చారిత్రాత్మకం - రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి

హైదారాబాద్ ఆగస్టు 11 :

తెలుగు రాష్ట్రాల సాహిత్యానికి డాక్టర్ సి.నారాయణరెడ్డి (సినారె) అందించిన సాహిత్య సేవ చారిత్రాత్మకమైనదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి అన్నారు.

శనివారం తుర్కయంజాల్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగిన మహాకవి సినారే కళాపీఠం సాహిత్య పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో చిన్నారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

 ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలకు చెందిన పలువురు సాహితీవేత్తలకు చిన్నారెడ్డి సినారే సాహిత్య పురస్కారాలను అందజేశారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిన్నారెడ్డి మాట్లాడుతూ సినారే పట్టుదల, క్రమశిక్షణ వల్ల ప్రతిభ ముప్పట అల్లుకొని ఆయన్ని శిఖరం చేసిందని పేర్కొన్నారు.  ప్రత్యక్షంగా తాను సినారెను కలిసింది తక్కువసార్లు అయినప్పటికీ ఆ అనుభవం వేల గ్రంథాల పరిజ్ఞాన విస్తరణ కలిగిందని చిన్నారెడ్డి తెలిపారు.

సినారే భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన కవిత్వం అజరామమరమని చిన్నారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా సాహిత్య ప్రేమికులతో పాటు సినీ గేయ సాహిత్యం సామాన్య ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుందన్నారు.

చివరి శ్వాస వరకు సాహిత్యాన్ని శ్వాసించిన నిరంతర కవి సినారే అని, సినారె లేరు కానీ ఆయన మాట, పాట బ్రతికే ఉన్నాయి అని చిన్నారెడ్డి వివరించారు.

ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ నందిని సిద్ధారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ భాష సాంస్కృతిక మండలి అధ్యక్షులు డాక్టర్ గంటా జలంధర్ రెడ్డి, సాహితీ వేత్తలు దాసరి దయానంద రెడ్డి, తేజ సాహిత్య సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ పోరెడ్డి రంగయ్య, కార్యక్రమ  నిర్వాహకులు మహాకవి సినారే కళా పీఠం అధ్యక్షులు మల్లకేడి రాములు, స్థానిక ప్రజాప్రతినిధులు కాకుమాను సునీల్ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర లకు చెందిన ప్రముఖ సాహితీవేత్తలు డాక్టర్ టి గౌరీ శంకర్ (హైదరాబాద్), వై హెచ్ కె మోహన్ రావు ( పల్నాడు - గుంటూరు),  సంగేనేని రవీందర్ ( ముంబయి - మహారాష్ట్ర), డాక్టర్ చిదేళ్ళ సీతాలక్ష్మి ( హైదరాబాద్), కన్నోజు లక్ష్మీకాంతం ( హైదరాబాద్), సమ్మెట ఉమాదేవి ( ఖమ్మం),  బూర్ల వెంకటేశ్వర్లు ( కరీంనగర్),  బిల్ల మహేందర్ ( వరంగల్),  డాక్టర్ కాసర్ల నరేష్ రావు ( నిజామాబాద్), ధ్యావరి నరేందర్ రెడ్డి ( రంగారెడ్డి) లకు మహాకవి సినారె సాహిత్య పురస్కారాలు డాక్టర్ జి చిన్నారెడ్డి నందిని సిద్ధారెడ్డి జలంధర్ రెడ్డి పోరెడ్డి రంగయ్య మల్లెకేడి రాములు అందజేశారు.

Tags