విషాద వార్త : డాక్టర్ కే ముత్యం ఇంకా లేరు.

On
విషాద వార్త : డాక్టర్ కే ముత్యం ఇంకా లేరు.

విషాద వార్త :
డాక్టర్ కే ముత్యం ఇంకా లేరు.

హైదారాబాద్ ఆగస్టు 20 :
కవి రచయిత పరిశోధకుడు శాతవాహన విశ్వవిద్యాలయంలో పూర్వ ఆచార్యులు.గత కొంతకాలంగా 
ఆనారోగ్యంతో ఉండి హైదరాబాదులో ఆగస్టు 20 తెల్లవారుజామున రెండున్నర గంటలకు మృతి చెందారు.
ముత్యంకు మిత్రులు  అశ్రు నివాళులు అర్పించారు.

ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కాలేజి పూర్వ విద్యార్ధి సంఘాలు అధ్యక్షులు తుల రాజేందర్, అయాచితం శ్రీధర్ లు తమ సంతాప సందేశంలో,డా  కె . ముత్యం గారు చనిపోయారని  ఇప్పుడే తెలిసింది.ఆయన మాకు అత్యంత ఆప్త మిత్రుడు  pdsu నిర్మాణానికి ప్రాణాన్ని  పణంగా పెట్టి ఎంతో  కృషి చేసినాడు  ప్రతిష్టాత్మకమైన ou arts college ప్రెసిడెంటుగా ఎన్నికైనాడని, ఆయన మృతిఎంతో విచారాన్ని కలిగించిందని అన్నారు. 

ఉస్మానియా రైటర్స్ సర్కిల్  స్థాపనలో  నిర్మాణంలో క్రియాశీలకంగా పనిచేసినాడు.ఉద్యోగం రాకపోయినా రాజీపడకుండా  జీవితాంతం నమ్మిన సిద్దాంతానికి కట్టుబడ్డాడు.గొప్ప పరిశోధకుడు  శ్రీకాకుళ ఉద్యమ సాహిత్యం మీద అనితరసాధ్యమైన పరిశోధన చేసిండు. ఇంకా ఎన్నో అద్భుతమైన పరిశోధన గ్రంథాలను వెలువరించిండు . ఆయన మరణం నన్ను ఎంతో కలచివేసిందని ఆయనకు జోహార్లు అర్పించారు.

డా. కె ముత్యం పుస్తకాలు-- వివరాలు. 

తెలుగు శాఖ, (పూర్వ అధిపతి), శాతవాహన విశ్వవిద్యాలయమం , కరీంనగర్

1. శ్రీకాకుళ ఉద్యమ సాహిత్యం
 సిద్ధాంత వ్యాసం/ 1993.

 2. కవిత్వం- స్షబ్దత..
 విమర్శ/ 1995..

3. జాతీయ  ఉద్యమం-- గరిమెళ్ళ  సాహిత్యం
 విమర్శ/ 1996.

4. సునాముది జీవధార
( రైతుల ప్రతిఘటన-చరిత్ర- కథనం) 
 రైతుల ఆర్థిక శాస్త్రం/ 2003.

5.  గరిమెళ్ళ సాహిత్యం- జాతీయ ఉద్యమం. 
 విమర్శ/   2003.

6. నేను చిందుల  ఎల్లమ్మను.. 
 స్వీయ - జీవిత చరిత్ర/ 2006.

7. చిందుల ఎల్లమ్మ యాది. 
 వేుదావి వెంకన్నతో కలసి/ స్మారక సంచిక/ 2006

 8. ఉత్తర తెలంగాణ సంస్కృతి చరిత్ర - చరిత్ర 
 సంకలనం/ 2011.

9. బంకుపల్లి మల్లయ్య శాస్త్రి జీవిత దృశ్యం
  జీవితచరిత్ర/ 2014.

10. తెలంగాణ శాస్త్రాలు. 
 జానపద సాహిత్యం/ సంపాదకత్వం/ 2015.

11. తెలంగాణ భాష- తెలుగు భాష- గిరిజన భాషలు. 
 భాషా శాస్త్రం/ సంపాదకత్వం/ 2016.

12. ప్రవహిస్తున్న జ్ఞాపకం. 
 జీవిత చరిత్ర/ 2017.

13. సుబ్బారావు 
పాణిగ్రాహి జీవితం
 జీవిత చరిత్ర/ 2018.

14. ఉత్తర  తెలంగాణ పల్లె  సంస్కృతి..
  జానపద సాహిత్యం/ విద్యార్థుల పరిశోధక  వ్యాసాలు/ సంపాదకత్వం/ 2018.

15. మట్టి రంగును ఎంచుకున్న కుంచె
 లక్ష్మీనరసింహారెడ్డితో కలిసి/ జీవిత చరిత్ర / 2018..

16. చిందుల ఎల్లమ్మ
 జీవిత చరిత్ర/ 2018.. 

17. గరిమెళ్ళ  ఆలభ్య 
 రచనలు/ 2019.

18.  తెలంగాణలో అలభ్య శాసనాలు- సాహిత్య గ్రంథాలు. 
 సంపాదకత్వం/2019.

19. బాచనపల్లి
 స్వయం ప్రకాష్ తో కలసి/ స్థానిక చరిత్ర/ 2019.

20. పుల్లెల శ్యామ సుందరరావు  జీవితం..
 జీవిత  చరిత్ర/ 2020,..

21.  కష్టాల కొలిమి- త్యాగాల శిఖరం:   సర్వదేవభట్ల  రామనాథం జీవితం.
 శివలింగంతో కలసి /జీవిత చరిత్ర/ 2021.

22. పిండిప్రోలు
 శివలింగంతో కలసి  /చరిత్ర/  2022.

23. ఈ ముగ్గురూ ఒక్కరే. 
  జీవిత చరిత్ర/ 2022.

24.  షిల్ల రాజుల రెడ్డి కవిత్వం- జీవితం. 
 విమర్శ /2022.

25. సోయం గంగులు. 
  చారిత్రక  నవల/ 2024.

 

Tags