బ్రహ్మంగారి నాటకంలో పాల్గొన్న కళాకారులకు ఘనంగా సత్కారం.

On
బ్రహ్మంగారి నాటకంలో పాల్గొన్న కళాకారులకు ఘనంగా సత్కారం.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల మే 18 ( ప్రజా మంటలు ) : 

స్థానిక పురానిపేట్ లోని విశ్వ కర్మ సత్సంగ భవన్ లో శ్రీ మద్విరాట్ శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారు జీవ సమాధి అయిన వైశాఖ శుద్ధ దశమి పర్వ దినం సందర్భంగా ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి.

శనివారం ఉదయం ప్రత్యేక సత్సంగము,భజనలు, అన్నదానము తో కార్య క్రమాలు ముగిసాయి.

గతనెల బ్రహ్మం గారి చరిత్ర నాటకంలో పాల్గొన్న కళాకరులందరినీ ఈసందర్బంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో యోగా గురూజీ వంగళ భస్కరాచారి,టీవీ సత్యం, తవుటు రామచంద్రం, రత్నయ్య, పూర్ణ చందర్, సత్య నారాయణ, రఘు,తిరుపతి సత్సంగ సభ్యులు, మాతలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags