బాలునిపై అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు

On
బాలునిపై అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు

బాలునిపై అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు 

(సిరిసిల్ల రాజేందర్ శర్మ)

జగిత్యాల డిసెంబర్ 23:

మైనర్ బాలునిపై అత్యాచారం చేసిన సంఘటనలో నిందితుడికి 20 సంవత్సరాలు జైలు శిక్ష,2000 రూపాయల జరిమానా విధించారు.

 మల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మైనర్ బాలుడిపై అత్యాచారం కేసులో నిందితుడు గోగుల సాయికుమార్‌కు జగిత్యాల ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేకాకుండా రూ.2000/- జరిమానా కూడా విధించింది.

 నిందితుడు గోగుల సాయికుమార్, సిరిపూర్ గ్రామానికి చెందిన మైనర్ బాలుడిని మామిడికాయలు తెచ్చుకుందామని చెప్పి గ్రామ శివారులోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై అప్పటి మల్లాపూర్ ఎస్సై డి. ప్రథ్వీధర్ కేసు నమోదు చేశారు.అప్పటి మెట్పల్లి సీ.ఐ ఎం. రవికుమార్ నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.కేసు విచారణలో సాక్షులను, శాస్త్రీయ ఆధారాలను సేకరించి కోర్టులో ప్రవేశపెట్టారు.

జగిత్యాల ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి నీలిమ ఈ కేసు విచారణ చేపట్టి, నిందితుడిని దోషిగా తేల్చి, శిక్ష విధించారు.

ఈ కేసును సమర్థంగా నిర్వహించిన అప్పటి ఎస్సై పృద్వీధర్, మెట్పల్లి సీఐ ఎం. రవికుమార్‌ను,కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టి విచారణను నడిపించిన కోర్టు కానిస్టేబుల్‌ రంజిత్ లను జిల్లా శ్రీ అశోక్ కుమార్  అభినందించారు.

Tags