రాయికల్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 99633494993/9348422113).
రాయికల్ డిసెంబర్ 17 (ప్రజా మంటలు) :
పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణం లోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఈ సందర్భంగా O.P. సేవలు, ఆన్ లైన్ రిజిస్టర్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఆసుపత్రిలో ప్రసూతి సేవలను, వైద్య సేవలను మెరుగు పరచాలని, డాక్టర్లు సమయ పాలన పాటించాలని కలెక్టర్ ఆదేశించారు.
రోజుకు ఎన్ని ఓ.పి.లను చూస్తున్నారు, ఎంతమంది డెలివరీలు అయ్యారని, ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీలను పెంచుటకు గర్భిణులను ప్రోత్సహించాలని డాక్టర్లకు సూచించారు. ఆసుపత్రిలో పేషెంట్లకు నాణ్యమైన ఆహారాన్ని, త్రాగునీరు అందించాలని వెంటనే పేషెంట్లకు అందించుటకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆసుపత్రిలో శుభ్రమైన త్రాగునీరు సరఫరా చేసే విధంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పేషెంట్ లను కలిసి వారి ఆరోగ్య వివరాలు మరియు హాస్పిటల్ సిబ్బంది వ్యవహరించే తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి భవనానికి కలర్స్ మరియు మరమ్మత్తులు చేయించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్ హాస్పిటల్ సూపరిండెంటెండ్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.